AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

ఢిల్లీకి చంద్రబాబు

ఢిల్లీకి చంద్రబాబు

న్యూఢిల్లీ, నవంబర్ 14, (న్యూస్ పల్స్)

AP CM

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు , ఏడీబి రుణాలపై సంతకాలు జరిగాయి. ముందస్తుగా పనులు ప్రారంభించడానికి అవసరమైన అడ్వాన్సులను విడుదల చేయాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది.

ఏపీకి కేంద్రం ఇటీవల పలు రకాల నిధులు, పెట్టుబడుల ప్రకటనలు చేసింది. వాటిని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలపైనా చంద్రబాబు ఫాలో అప్ చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో ప్రస్తుత రాజకీయాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు ఎన్డీఏ కూటమి బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపైనా బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
మహరాష్ట్రలోప్రచారం చేసే అవకాశం

ఆ తర్వాత శని, ఆదివారాల్లో చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉమ్మడి బహిరంగసబను ఎన్డీఏ పార్టీలు నిర్వహించే అవకాశం ఉంది. ముంబైతో పాటు మహారాష్ట్రలో దాదాపుగా కోటి ముంది తెలుగు మూలాలున్న వారు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు నేతలు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహారాష్ట్రంలో గెలుపును ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. చంద్రబాబు ఇతర మిత్ర పక్ష పార్టీలకు ప్రచారం చేసేందుకు ఇతర రాష్ట్రాలకు తరచూ వెళ్తూంటారు. గతంలో ఉత్తరాదిన .. కర్ణాటకలో దేవేగౌడ పార్టీ తరపున కూడా ప్రచారం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేస్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వేరే రాష్ట్రంలో పరస్పరం వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లవుతుంది.

ఢిల్లీకి చంద్రబాబు

Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

Related posts

Leave a Comment