AP | ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ | Eeroju news

ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ

ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ

విజయవాడ, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)

AP

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్‌… విజయవాడ కనకదుర్గ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం అప్పన్న దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాలను ఆవు నెయ్యితోనే తయారు చేస్తున్నారా? నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనేదానిపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది.అన్ని అలయాల్లోనూ నెయ్యి క్వాలిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. సింహాచలం, అన్నవరంలో ప్రసాదాల నుంచి శాంపిల్స్ సేకరించారు.

అన్నవరం దేవస్థానంలో వాడే నెయ్యి గడ చిన రెండేళ్లుగా ఒకే కాంట్రాక్టర్‌ సరఫరా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అలాగే అంతర్వేది, వాడపల్లి.. పాదగయ తదితర ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. దేవుడి దీపారా ధనకు వినియోగించే నెయ్యి, ప్రసాదాల్లో వాడే నెయ్యి అసలు ఎక్కడి నుంచి వస్తోంది? ఎంత ధరకు కొంటున్నారు? నాణ్యత అసలు పాటిస్తున్నారా? అనే చర్చ రెండ్రోజులుగా జరుగుతోంది. మరోపక్క తిరుపతి ఘటనతో ఉమ్మడి జిల్లాలో ఆలయాల్లో అధికారులు సైతం ఉలిక్కి పడుతున్నారు. ఇంతకాలం వాడుతున్న నెయ్యి నాణ్యతపై పెద్దగా దృష్టిసారించని అధికారులు తాజా పరి ణామాలతో నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నారు.

నెయ్యి ఎక్కడి నుంచి తెస్తున్నారు? నాణ్యత మంచిదేనా అంటూ ఆరా తీస్తున్నారు. కాగా అన్నవరం దేవస్థానానికి ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తోన్న కాంట్రాక్టరు గడువు ఈనెలతో ముగుస్తోంది. వచ్చేనెల ఒకటి నుంచి మరో కొత్త కాంట్రాక్టరు వస్తున్నారు. దీంతో ఆ నెయ్యిపైనా ఇప్పటినుంచే అధికారులు దృష్టిసారించారు. కొత్త కాంట్రాక్టు కంపెనీ తిరుపతిది కావడంతో అక్కడ ఎక్కడ కొనుగోలు చేస్తు న్నారో కొందరు ఆరా తీస్తున్నారు. మరోపక్క తిరుపతి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుండడం, ఇదే సమయంలో ఇతర ఆలయాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతపైనా కొత్తగా సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ఆలయాల నుంచి నెయ్యి శాంపిళ్లను త్వరలో పరీక్షించాలని నిర్ణయించింది.

అన్నవరంతోపాటు ఇతర ఆలయాల నెయ్యి శాంపిళ్లను అధికారులు సేకరించబోతున్నారు. కాగా ఆలయాల్లో ప్రసాదాలు, దీపారాధనకు వినియోగించే నెయ్యి ఎలాంటిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతకు ఆలయ అధికారులు కొనుగోలు చేస్తారు? వంటి వివరాలు ఇంతకాలం అసలు ఎవరు పట్టించుకోలేదు. కానీ తిరుపతి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి చోటా నెయ్యి నాణ్యతపైనే అంతా చర్చించుకుంటున్నారు. ఇదిలాఉంటే కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంతోపాటు అనేక పట్టణాల్లో స్థానిక డెయిరీలు, ఇతర ప్రైవేటు వ్యాపారులు నెయ్యిని ప్యాకెట్లతోపాటు లూజుగాను విక్రయిస్తుంటారు.

తాజా ఘటన నేపథ్యంలో ప్రజలు నెయ్యి నాణ్యతను ఆరా తీస్తూ జాగ్రత్త పడుతుండడం విశేషం. అటు సోషల్‌ మీడియాలోను ఇదే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇలా ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్‌ ఘీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్‌. దీనిలో భాగంగాలో సింహాచలంలో తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. ప్రసాదం నాణ్యతను పరిశీలించి రికార్డులను చెక్‌ చేశారు గంటా. లడ్డూ బరువును తూకం వేసి పరిశీలించారు. తక్కువ రేట్లకు నెయ్యి కొంటే..దానిలో క్వాలిటీ ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు.ఇక అన్నవరం ప్రసాదంపై కూడా ఆరోపణలు రావడంతో…ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు.

ప్రసాదం నాసిరకంగా ఉందని ఆరోపణలు రావడంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే. 6 నెలలకు ఒకసారి టెండర్‌ను మార్చాల్సి ఉందని, అయితే రెండేళ్లుగా ఒకే వ్యక్తికి టెండర్‌ ఇచ్చారన్నారు సత్యప్రభ. ప్రసాదంలో వాడే పదార్థాల శాంపిల్స్‌ను సేకరించామని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు.ఇలా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల పరీక్ష, టెండర్ల తనిఖీ, వస్తువుల క్వాలిటీ చెకింగ్‌ చేపడుతున్నారు.

ఏపీలో కొనసాగుతున్నఆపరేషన్ ఘీ

 

Tirupati Laddu | తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా | Eeroju news

Related posts

Leave a Comment