Andhra Pradesh:4 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు

Cancellation of registrations of 4 lakh acres
Andhra Pradesh:4 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు: రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని.. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో.. 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు గుర్తించినట్లు ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెంట జిల్లా కలెక్టర్‌ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్రమంగా చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని వెల్లడించారు.

4 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు

విజయవాడ, ఫిబ్రవరి 22
రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని.. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో.. 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు గుర్తించినట్లు ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వెంట జిల్లా కలెక్టర్‌ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అక్రమంగా చేసిన భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని వెల్లడించారు. ఏపీలో దాదాపు 13 లక్షల ఎకరాలకు గానూ 4 లక్షల ఎకరాల భూములను అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు రెవెన్యూశాఖ గుర్తించినట్లు చెప్పారు. ఈ లక్షల ఎకరాల భూముల్లో 25 వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వెల్లడించారు. ఆ భూముల్లో 8 వేల ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలినట్లు స్పష్టం చేశారు. ఇక నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 4 లక్షల ఎకరాల భూములతోపాటు ఈ 8 వేల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆర్పీ సిసోడియా తేల్చి చెప్పారు.
గతేడాది అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాల కాలిపోవడంతో మొత్తం ఆఫీస్ దెబ్బతింది. ఈ క్రమంలోనే మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీస్‌ను పునరుద్ధరించగా.. ఆ కార్యాలయాన్ని ఆర్పీ సిసోడియా బుధవారం ప్రారంభించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాలు వెల్లడించారు. ఇక ఆఫీస్ దహనం అయిన 2400 దస్త్రాలను తిరిగి రికవరీ చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్, తహసీల్దార్ల కార్యాలయాల్లో ఉన్న రికార్డుల లింకు దొరకడంతో ఈ దస్త్రాలను రికవరీ చేయడం సాధ్యమైనట్లు తెలిపారు.ఈ క్రమంలోనే ఆ దస్త్రాల రికవరీలో భాగంగానే ఫ్రీహోల్డ్‌ భూముల అక్రమాలు బయటికి వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు.. ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ దస్త్రాల దహనం కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని.. వేరే బయటి వ్యక్తులతో సంబంధాలు ఉండడంతో దర్యాప్తు పూర్తి అయ్యేందుకు కొంత సమయం పడుతోందని వివరించారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించిన ఆర్పీ సిసోడియా.. ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో తలెత్తిన న్యాయపరమైన వివాదాలతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. కొత్త రిక్రూట్‌మెట్లు కూడా త్వరలోనే చేపడతామని స్పష్టం చేశారు.

Related posts

Leave a Comment