Andhra Pradesh: జనసేన ఆవిర్భావ పభకు మెగా, అల్లు ఫ్యామిలీ

Mega, Allu family celebrate Jana Sena's formation
Andhra Pradesh: జనసేన ఆవిర్భావ పభకు మెగా, అల్లు ఫ్యామిలీ:జనసేన పార్టీ ఏర్పడి సరిగ్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకొని 11వ ఏటలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా, ఈ నెల మార్చి 14న పిఠాపురం లో కనివిని ఎరుగని రేంజ్ లో గ్రాండ్ గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరగబోతుంది. ఇందుకు సంబంరందించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనసేన పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రతీ జిల్లాకు వెళ్లి కార్యకర్తలను, పార్టీ నాయకులను ఆవిర్భావ దినోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిస్తున్నారు.

జనసేన ఆవిర్భావ పభకు మెగా, అల్లు ఫ్యామిలీ

కాకినాడ,  మార్చి 11
జనసేన పార్టీ ఏర్పడి సరిగ్గా 10 ఏళ్ళు పూర్తి చేసుకొని 11వ ఏటలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా, ఈ నెల మార్చి 14న పిఠాపురం లో కనివిని ఎరుగని రేంజ్ లో గ్రాండ్ గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరగబోతుంది. ఇందుకు సంబంరందించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనసేన పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రతీ జిల్లాకు వెళ్లి కార్యకర్తలను, పార్టీ నాయకులను ఆవిర్భావ దినోత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. ఇది వరకు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి జరగబోతున్న వేడుకలు వేడుకలు వేరు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆవిర్భావ దినోత్సవ సభలు నిర్వహించేవాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించబోతున్నాడు. తనని 70 వేల ఓట్లకు పైగా మెజారిటీ తో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా పిఠాపురం లోనే ఈ వేడుకలను జరపబోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ సభకు దాదాపుగా ఆరు లక్షల మంది జనాలు హాజరు అవుతారని టాక్. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు హాజరు అయ్యే అవకాశాలు ఉండడం తో ఏర్పాట్లు కూడా వచ్చే వాళ్లకు ఎలాంటి అసౌకర్యం గా ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
మార్చ్ 14వ తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానుంది. ఇదంతా పక్కన పెడితే ఒక భారీ విజయం తర్వాత జరుపుకుంటున్న పండుగ కావడంతో, ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందా అనే సందేహాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారు కూడా పాల్గొనబోతున్నారని టాక్.ఒకవేళ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఈ వేడుకల్లో పాల్గొంటే అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా కాలం నుండి మీడియా లో మెగా, అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు, మేమంతా ఒక్కటే అనే చాటి చెప్పేందుకే అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టు సమాచారం. అంతే కాదు అల్లు అర్జున్ కి అత్యంత ఆప్తుడైన బన్నీ వాసు మార్చి 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోషల్ మీడియా మ్యానేజర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన పాలకొల్లు కి సంబంధించిన అనేక మందిని జనసేన పార్టీ లో నాదెండ్ల మనోహర్ సమక్షం లో చేర్పించాడు.

Related posts

Leave a Comment