Andhra Pradesh: ఏపీకి టెస్లా కంపెనీ:ప్రపంచ ప్రఖ్యాత గాంచిన టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ ఎలాన్ మస్క్ తో సమావేశమయినప్పుడు భారత్ కు వచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే న్యూ ఢిల్లీ, ముంబయిలో టెస్లా కంపెనీ కార్యాలయాలను ప్రారంభించడమే కాకుండా అందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించేందుకు టెస్లా కంపెనీ సిద్ధమయింది.
ఏపీకి టెస్లా కంపెనీ
విజయవాడ, ఫిబ్రవరి 24
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ ఎలాన్ మస్క్ తో సమావేశమయినప్పుడు భారత్ కు వచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే న్యూ ఢిల్లీ, ముంబయిలో టెస్లా కంపెనీ కార్యాలయాలను ప్రారంభించడమే కాకుండా అందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించేందుకు టెస్లా కంపెనీ సిద్ధమయింది. ఢిల్లీతో పాటు ముంబయిలో తొలుత షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే టెస్లా కంపెనీ వాహనాల తయారీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది చెప్పలేదు. అందుకోసం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అయితే ఎలాన్ మస్క్ మదిలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడంపై సానుకూలతగా ఉన్నారని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు ఇప్పటికే అనంతపురంలో కియా పరిశ్రమ కార్ల ఉత్పత్తిని తయారు చేస్తూ గణనీయమైన ప్రగతిని సాధించింది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమ కు దగ్గరలోనే బెంగళూరు ఉండటంతో కార్ల రవాణా కూడా సులువుగా మారనుంది. అనేకచోట్లకు కార్గో విమానాల ద్వారా పంపేందుకు సులువుగా మారింది. దీంతో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీని కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఇది తమిళనాడుకు దగ్గరగా ఉండటం, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, సముద్రం ద్వారా కార్లను పంపే సౌకర్యం ఉండటంతో దీనిని కూడా పరిశీలస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చంద్రబాబు ఈ విషయంలో రెండడుగులు ముందుకు వేసి టెస్లా కంపెనీని ఏపీకి తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు.
పొలిటికల్ లాబీయింగ్ తో పాటు తనకున్నఅనుభవాన్నిజోడించి టెస్లా కంపెనీని ఏపీకి తీసుకు వచ్చి ప్రత్యర్థుల నోళ్లను మూయించాలని భావిస్తున్నారు. గత ఏడాది అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేశ్ కూడా టెస్లా సీఎఫ్ఓవైభవ్ తనేజాకు ఏపీలో సానుకూలపరిస్థితులు వివరించారు. ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో సంబంధాలున్న వారందరితో పెద్దయెత్తున లాబీయింగ్ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. స్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా కృషిచేస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఆంధ్రప్రదేశ్‌ను టెస్లాకు అనువైన గమ్యస్థానంగా మార్చుతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టుల అనుసంధానం, భూమి లభ్యత.. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు 2024 అక్టోబర్‌లోనే టెస్లా కంపెనీతో ఏపీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. అప్పట్లో అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఈ విషయంపై చర్చించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ భేటీతో ప్లాంట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.మరోవైపు టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అవసరమైన భూమిని సైతం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే టెస్లా కంపెనీ తొలుత కార్ల దిగుమతిపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాతే పూర్తి స్థాయి తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ఏ మేరకు వర్కవుట్ అవుతుంది.. టెస్లా కంపెనీ ఏపీకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి ఇప్పటికే కార్ల ఉత్పత్తి, అమ్మకాలు కూడా జరుగుతున్నాయి.నిజంగా ఏపీ టెస్లాకు వస్తే మాత్రం చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది పెట్టుబడుల రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించినట్లే. ఈ విషయం నేషనల్ మీడియాలో కూడా రావడంతో ఇతర రాష్ట్రాల సీఎంలు అప్రమత్తమయ్యారు