Andhra Pradesh | ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు | Eeroju news

ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు

ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు

నెల్లూరు, నవంబర్ 27, (న్యూస్ పల్స్)

Andhra Pradesh

AP Pension Kanuka: ఏపీలో ఫించన్‌ పథకం పేరు మార్పు.. పింఛన్ నగదు పెంపు.. ఎంతంటే.. | Sakshi Educationఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకేవేళ ఆరోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న, లేదంటే వచ్చే నెల 1న రెండు నెలల పెన్షన్లను పొందొచ్చని కూటమి ప్రభుత్వం తెలిసింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది.సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఉంటుంది.

ఒకవేళ ఆ రోజు సెలవు అయితే మాత్రం అంతకుముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు తెల్పింది. అంటే నవంబర్ 30వ తేదీన పింఛన్‌ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునే లభ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే తర్వాత నెలలో దానిని ఇచ్చేవారు కాదు. దీంతో ఏ నెలకు ఆ నెల పింఛన్‌ తీసుకునేందుకు లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి పరుగుపరుగున ఒకటో తేదీన ఠంఛన్‌గా చేరుకునేవారు.

ఇకపై ఆ బెంగ కూడా లేదు.ఎందుకంటే.. ఒక నెల పింఛన్‌ తీసుకోని వారికి ఆ తర్వాత నెలలో దానిని కలిపి రెండు నెలల నగదును ఒకేసారి ఇవ్వనున్నారు. అలాగే వరుసగా 2 నెలలు పింఛన్‌ తీసుకోని వారికి 3వ నెలలో మూడు నెలలకు కలిపి పింఛన్ డబ్బులు అందజేస్తారు. డిసెంబర్‌ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే వరుసగా మూడు మాసాలు తీసుకోపోతే మాత్రం శాశ్వత వలసగా పరిగణించి.. ఆ లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్‌ తొలగిస్తుంది. ఆ తర్వాత వచ్చినా రోల్‌బాక్‌ ద్వారా మళ్లీ మంజూరు అవుతుంది. అయితే మూడు నెలల బకాయిలు మాత్రం ఇవ్వరు.

ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు

Distribution of Social Finchans | సామాజిక ఫించన్లు పంపిణీ | Eeroju news

 

Related posts

Leave a Comment