Andhra Pradesh:సూర్యలంకకు పోటెత్తున్నారో:నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు. అందులోనూ బీచ్ లో గడపటమంటే ఏ మాత్రం వెనకాడరు. అలలు చూస్తే ఇక వయసు ఆగదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బీచ్ లకు వెళ్లి అక్కడే గంటల కొద్దీ గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది. బీచ్ లకు వెళ్లాలంటే గోవాకు వెళ్లాల్సిందే. అక్కడ అందుబాటులో బీచ్ లు ఉండటంతో పాటు అన్ని రకాల వసతులు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం వెరసి గోవాకు బీచ్ లే పెద్ద అస్సెట్ గా మారాయనడంలో సందేహం లేదు. విదేశీయుల నుంచి ఇతర రాష్ట్రాల పర్యాటకులతో గోవా బీచ్ లు ఎప్పుడూ సందడిగా మారుతుంటాయి.
సూర్యలంకకు పోటెత్తున్నారో
ఒంగోలు, ఫిబ్రవరి 20
నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు. అందులోనూ బీచ్ లో గడపటమంటే ఏ మాత్రం వెనకాడరు. అలలు చూస్తే ఇక వయసు ఆగదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బీచ్ లకు వెళ్లి అక్కడే గంటల కొద్దీ గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుంది. బీచ్ లకు వెళ్లాలంటే గోవాకు వెళ్లాల్సిందే. అక్కడ అందుబాటులో బీచ్ లు ఉండటంతో పాటు అన్ని రకాల వసతులు, మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం వెరసి గోవాకు బీచ్ లే పెద్ద అస్సెట్ గా మారాయనడంలో సందేహం లేదు. విదేశీయుల నుంచి ఇతర రాష్ట్రాల పర్యాటకులతో గోవా బీచ్ లు ఎప్పుడూ సందడిగా మారుతుంటాయి. టూరిజంపై వచ్చే ఆదాయంతోనే గోవా ప్రభుత్వం నడుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టూరిజం అభివృద్ధిలో భాగంగా బీచ్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతికి దగ్గరలోనే సహజ సిద్ధమైన సూర్యలంక బీచ్ ను ముస్తాబు చేస్తున్నారు. పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న ఏకైక బీచ్ ఇదే కావడంతో దీనికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల పొడవున సహజ సిద్ధమైన బీచ్ విస్తరించి ఉండటం సూర్యలంక బీచ్ ప్రత్యేకత. రాజధాని అమరావతికి కేవలం 70 నుంచి 80 కిలో మీటర్ల దూరంలోనే ఈ బీచ్ ఉండటంతో దానిని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకంగా లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.ఇప్పటికే సూర్యలంక బీచ్ కు అనేక మంది పర్యాటకులు వచ్చిపోతున్నారు. అయితే తెలిసిన వాళ్లు మాత్రమే అక్కడికి వస్తుంటారు. కేవలం దగ్గర ప్రాంతాల వారు మాత్రమే ఇక్కడకు వచ్చి వెళుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రావాలంటే ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో పెద్దగా అభివృద్ధి చెందడం లేదు. దీంతో ఈ బీచ్ లో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నలభై లక్షలరూపాయలను వెచ్చించాలని నిర్ణయించింది. బాపట్ల సూర్యలంక బీచ్ అంటే అక్కడ ప్రకృతిసిద్ధమైన ఎన్నో మధురానుభూతులు లభించే అవకాశం ఉండటంతో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు అక్కడ డ్రెస్సింగ్ రూములు, మంచీనీటి పంపులు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. దీంతో సూర్యలంక బీచ్ కు మహర్దశ పట్టనుంది. మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. రోజుకు ఐదు వేల మంది పర్యాటకులు వస్తారన్న అంచనాతో సదుపాయలు కల్పిస్తున్నారు.
Read more:Vijayawada:అరెస్ట్ల్ లకు సిద్దంగా ఉండండి