Andhra Pradesh:వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్

behavior of some MLAs in AP is becoming controversial.

Andhra Pradesh:వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్:ఏపీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అనవసర విషయాల్లో జోక్యం వద్దు అంటూ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. అధినేత ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న రామాయపట్నం పోర్టు పనుల్లో తనకు వాటాలు కావాల్సిందేనని ఆ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.

వాటాల కోసం ఎమ్మెల్యే డిమాండ్

ఒంగోలు, మార్చి 13
ఏపీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అనవసర విషయాల్లో జోక్యం వద్దు అంటూ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతున్నారు. అధినేత ఆదేశాలను పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. తన నియోజకవర్గంలో జరుగుతున్న రామాయపట్నం పోర్టు పనుల్లో తనకు వాటాలు కావాల్సిందేనని ఆ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అయితే అందుకు ఆ కాంట్రాక్టు సంస్థ నిరాకరించడంతో తన ప్రతాపాన్ని చూపుతున్నారు. పోర్టు నిర్మాణానికి తరలిస్తున్న కంకర, ఇసుక లారీలను అడ్డగిస్తున్నారు. తప్పుడు కేసులతో వేధింపులకు దిగుతున్నారు. ప్రతి ట్రిప్పునకు వెయ్యి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం సీఎం కార్యాలయానికి చేరింది. సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన ఆ ఎమ్మెల్యే వెనక్కి తగ్గడం లేదు. దందాను కొనసాగిస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది.రామాయపట్నం పోర్టు నిర్మాణం పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. పనులను శరవేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పోర్టు నిర్మాణంలో దందా జరిగింది. అది పనులపై ప్రభావం చూపింది. ఆ పరిస్థితి లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. స్వయంగా టిడిపి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సరికొత్త దందాకు దిగినట్లు టిడిపి అనుకూల మీడియాలోనే ప్రచారం ప్రారంభమైంది. పోర్టు నిర్మాణ పనుల్లో తనకు వాటా ఇవ్వాలని ఇంటూరి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే అందుకు సదరు కాంట్రాక్టు సంస్థ సమ్మతించలేదు. దీంతో ఇంటూరి తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టారు. భయపెట్టి అయినా సరే కాంట్రాక్టు సంస్థను దానికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోర్టు నిర్మాణాల కోసం కంకర, ఇసుక తెస్తున్న లారీలకు అడ్డం పడ్డారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ వెళ్లకుండా చేయడం ద్వారా నిర్మాణ సంస్థను తన దారికి తెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.వాటాల కోసం పెద్ద డిమాండ్లు తెరపైకి తెచ్చారు ఇంటూరి నాగేశ్వరరావు అవి వర్కౌట్ కాకపోయేసరికి.. నయా దందాకు దిగారు. కాదంటే ఒక్కో లారీ ట్రిప్పునకు వెయ్యి రూపాయల చొప్పున తనకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సదరు సంస్థ ఒప్పుకోకపోవడంతో పోలీసులను అడ్డం పెట్టుకొని లారీలను రోడ్డుపై నిలిపివేయిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. పోర్టు పనులు ముందుకు సాగకుండా అరాచకం సృష్టిస్తున్నారు. అయితే జిల్లాలో జరుగుతున్న ఈ దందా గురించి ప్రకాశం జిల్లా నేతలు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. చాలామంది ఇప్పటికే నేరుగా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దీనిపై సీఎంఓ సీరియస్ గా స్పందించింది. జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అరాచకం మాత్రం ఆగలేదని తెలుస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more:Andhra Pradesh:యాక్షన్.. రియాక్షన్

Related posts

Leave a Comment