Andhra Pradesh:రాజధాని పై వైసీపీ వాదనేంటీ

YCP- ap capital-alinces

Andhra Pradesh:రాజధాని పై వైసీపీ వాదనేంటీ:ఎనిమిది నెలల కిందటి వరకు అదో ముగిసిన కథ. ఇప్పుడది తిరిగి నిలబడుతున్న 8 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ఎజెండా. తుడిపేద్దామనుకున్న చరిత్రను తిరిగి రాస్తున్న సమయంలో.. చావు దెబ్బ తిని కూడా మళ్లీ పాత రాగమే వినిపిస్తోంది వైసీపీ.

రాజధాని పై వైసీపీ వాదనేంటీ

విజయవాడ,ఫిబ్రవరి 10
ఎనిమిది నెలల కిందటి వరకు అదో ముగిసిన కథ. ఇప్పుడది తిరిగి నిలబడుతున్న 8 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ ఎజెండా. తుడిపేద్దామనుకున్న చరిత్రను తిరిగి రాస్తున్న సమయంలో.. చావు దెబ్బ తిని కూడా మళ్లీ పాత రాగమే వినిపిస్తోంది వైసీపీ. అసలు ఏపీ కంటూ ఓ రాజధాని లేదని గత ఐదేళ్లు అభాసుపాలు చేసి.. మీ రాజధాని ఏంటని అడిగితే సగటు ఆంధ్రుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని క్రియేట్ చేసి ఇప్పుడు మళ్లీ.. కొత్త బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తోంది వైసీపీ.2015లో ఏపీ రాజధాని అమరావతిగా డిసైడ్ చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అప్పుడు అపోజిషన్ లో ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కట్ చేస్తే 2019లో పవర్ లోకి రాగానే అపరిచితుడు బయటికి వచ్చాడు. మూడు రాజధానులు అంటూ రోజుకో కథ చెప్పారు. తీరా అటు ప్రజలను ..ఇటు తమ పార్టీని నవ్వుల పాలు చేసిన ఆ నేత.. ఘోరంగా ఓడినా తీరు మార్చుకోవడం లేదు.వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు తెరమీదకు వచ్చిందే మూడు రాజధానుల ముచ్చట. లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా విశాఖ, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ అని కొత్త స్టోరీ చెప్పి..లాస్ట్ కు బొక్కబోర్లా పడింది వైసీపీ. చెప్పినట్లుగా విశాఖ నుంచి పాలన ప్రారంభించ లేదు. పోనీ కర్నూలులో హైకోర్టు బెంచ్ ను కూడా ఏర్పాటు చేయలేకపోయింది. అలా ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేకుండానే ఐదేళ్లు గడిచిపోయాయివైసీపీ హయాంలో రాజధాని అంటే ఓ జోక్ గా చెప్పుకునే పరిస్థితి. సోషల్ మీడియాలో ట్రోల్స్ ను గుర్తు చేసుకుంటే బాధ పడటం తప్ప ఇంకోటి ఉండదు. అదంతా ఒక ఎత్తు అయితే ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల స్లోగన్ కు ప్రజలు మూతోడ్ జవాబ్ ఇచ్చారు. విశాఖ క్యాపిటల్ అని గొప్పగా చెప్తే.. ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే కంచుకోట బీటలు వారింది.

ఇక అమరావతి చుట్టు పక్కల ప్రజలు కొడితే ముఖం పగిలిపోయింది. ఇంత జరిగి..పబ్లిక్ పల్స్ ఏంటో తెల్సినా కూడా మళ్లీ మూడు రాజధానులపై తమ స్టాండ్ ఏంటో చెప్తామంటోంది వైసీపీ.ఓ రాజకీయ పార్టీకి ప్రజల నిర్ణయమే ముఖ్యం. పబ్లిక్ పల్స్ ను పట్టుకుని డెసిషన్స్ తీసుకుంటేనే మనుగడ ఉంటుంది. కానీ ఇగోకు పోయి..చంద్రబాబు తెచ్చిన అమరావతిని కాదని..అక్కడేదో స్కామ్ జరిగిందని..కొండంత పాట పాడి ఏదో రాగం తీసింది వైసీపీ. సరే అంత చేసినా మూడు రాజధానులను ఇంప్లిమెంట్ చేశారా అంటే అదీ లేదు. పలుసార్లు కోర్టు మొట్టికాయలు వేయడంతో అధికారంలో ఉన్నప్పుడు త్రీ క్యాపిటల్స్ డెసిషన్ ను ఇంప్లిమెంట్ చేయలేకపోయారు.ఇప్పుడు కాకపోతే ఇంకో 40 ఏళ్లకు రాజధాని నిర్మాణం జరిగినా.. అమరావతే క్యాపిటల్..అలా అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు అపోజిషన్ లోకి వచ్చాక కూడా తీరు మారకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు.రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా రాజధాని లేని రాష్ట్రంగా ఆగం చేసి.. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్న అమరావతి పనులపై అక్కసు ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. ఇప్పుడు కాకపోతే ఇంకో 40 ఏళ్లకు రాజధాని నిర్మాణం జరిగినా.. అమరావతే క్యాపిటల్.. ఇదే ఫైనల్..మేము ఫిక్స్ అయ్యాం..మీరు డిసైడ్ అయిపోండంటూ వైసీపీకి సూచిస్తున్నారుఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ముగిసిన అధ్యాయమనుకున్న దాన్ని తెరిచింది. కేంద్రాన్ని బతిమాలో..రిక్వెస్ట్ చేసో..సిచ్యువేషన్స్ వివరించో ఫండ్స్ తెస్తున్నారు సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర రాజధానికి వేల కోట్ల నిధులను తెస్తూ అమరావతిని ఒక రూపునకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఏపీ ప్రజలు కూడా అమరావతే రాజధాని అని కూడా డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇప్పుడు ఎవరేమి చెప్పినా కొత్త నినాదం తీసుకున్నా అది బూమరాంగ్ అవుతుంది. వైసీపీకి ఈ విషయాలన్నీ తెలియకుండా ఉంటాయా అని అంటున్నారు పబ్లిక్.పైగా రాజధాని అన్నది పబ్లిక్ ఎమోషన్, సెంటిమెంట్ కు సంబంధించిన ఇష్యూ. అలాంటి మ్యాటర్ లో ఆలోచించి మాట్లాడకుండా పిక్చర్ అబీ బాకీ హై అన్నట్లు ప్రగల్బాలు పలికితే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేడంటున్నారు పబ్లిక్. అయితే మూడు రాజధానుల విషయంలో వైసీపీ తన స్టాండ్ మార్చుకోబోతుందన్న చర్చ సాగుతోంది.అందరూ కోరుకునే అమరావతికే జై కొడుతూనే ఇతర ప్రాంతాల అభివృద్ధి అనే నినాదాన్ని ఎత్తుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో తమ స్టాండ్ ఏంటో చెప్తామన్నారు కాబట్టి చూడాలి మరి వైసీపీ వైఖరి ఎలా ఉంటుందో.

Read more:Srikakulam:ప్రతి గ్రామంలోనూ..తండేల్ కథే

Related posts

Leave a Comment