Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే

Rajampet will be the first place to win in the joint Kadapa district.

Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే:ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం ఓటమి ఎదురైంది.లోకల్ వర్సెస్ నాన్‌ లోకల్‌ ఫైట్.. రాజంపేటలో సైకిల్‌ను ఇబ్బందిపెట్టాయ్‌. ఐతే అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్‌. ముగ్గురు నేతలు.. ఎవరికి వారే అనేట్లు వ్యవహరిస్తుండడంతో.. కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. ఇంచార్జి ప్లీజ్ అంటోంది.. ఇంతకీ రాజంపేటలో ఏం జరుగుతోంది..కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో.. జనాల్లో ఆశలు పెరుగుతున్నాయ్‌

రాజంపేటలో ఎవరికి వారే..

కడప, మార్చి 4
ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం ఓటమి ఎదురైంది.లోకల్ వర్సెస్ నాన్‌ లోకల్‌ ఫైట్.. రాజంపేటలో సైకిల్‌ను ఇబ్బందిపెట్టాయ్‌. ఐతే అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్‌. ముగ్గురు నేతలు.. ఎవరికి వారే అనేట్లు వ్యవహరిస్తుండడంతో.. కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. ఇంచార్జి ప్లీజ్ అంటోంది.. ఇంతకీ రాజంపేటలో ఏం జరుగుతోంది..కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో.. జనాల్లో ఆశలు పెరుగుతున్నాయ్‌. దీంతో జనాలకు దగ్గరగా ఉండాలని.. జనాల్లో ఉండాలని నేతలకు సూచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ నుంచి.. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో కచ్చితంగా పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త కన్ఫ్యూజన్‌ క్రియేట్ చేస్తోంది.రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు పర్యటనలతో హడావుడి చేస్తుంటే.. రాజంపేటలో మాత్రం సీన్‌ కాస్త తేడాగా కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభంజనంలోనూ రాజంపేట స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకోగా.. అక్కడ టీడీపీ తరఫున ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐతే తమకు తామే అన్నట్లు ఎవరికి వారే ఉండడంతో.. ఆ ముగ్గురిలో ఎవరిని పిలవాలో తెలియక.. అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలను ముగించేస్తున్నారు. దీనిపై సొంత పార్టీలోనే కొత్త చర్చ జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.కడప జిల్లాల్లో పసుపు జెండా ఫస్ట్ ఎగిరేది రాజంపేటలోనే అనుకున్నారు ఎన్నికల ముందు ! ప్రతీ ఎంపీ నియోజకవర్గాన్ని జిల్లా చేసిన మాజీ సీఎం జగన్.. రాజంపేటకు బదులు రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది అప్పట్లో ! దీంతో జగన్ మీద వ్యతిరేకతతో కూటమి వైపే జనం ఉంటారని లెక్కలేసుకున్నారుకట్‌ చేస్తే సీన్ రివర్స్ అయింది. లోకల్ పార్టీ లీడర్లను పక్కన పెట్టి.. పక్క నియోజకవర్గం నుంచి నేతను తీసుకొచ్చి రాజంపేట బరిలో దింపారు చంద్రబాబు. టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చమ్మర్తి జగన్‌ మోహన్‌ రాజు.. రాజంపేట సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

 

ఇక మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడు విజయ శేఖర్ కూడా యాక్టివ్‌గా పనిచేశారు.ఇద్దరినీ కాదని.. రాయచోటికి చెందిన సుగవాసికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు చంద్రబాబు. అందరూ కలిసి పనిచేయాలని అధినేత సూచించినా.. వర్కౌట్‌ కాలేదు. గెలిచే అవకాశం ఉన్న స్థానాన్ని కోల్పోయింది టీడీపీ. పైగా ఇప్పటికీ రాజంపేట ఇంచార్జి ఎవరనేది క్లారిటీ లేకపోవడంతో.. పార్టీకి కొత్త సమస్యలు వస్తున్నాయట.రాజంపేటలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్‌ కనిపిస్తోంది. ముగ్గురు నేతలు ఎవరికి కోసం వాళ్లే అన్నట్లుగా పనులు కానిచ్చేస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు.. ఇద్దరూ రాయచోటి వాసులే ! లోకల్‌గా కేడర్‌ ఈ ఇద్దరితో కలవలేకపోతుందనే ప్రచారం నడుస్తోంది.ఇక వైసీపీ నేత మేడా మల్లికార్జున్ రెడ్డికి.. విజయ శేఖర్ రెడ్డి వరుసకు సోదరుడు. మల్లికార్జున్ రెడ్డి వైసీపీలో బలమైన నేత ఉండడం.. విజయ శేఖర్ రెడ్డికి మైనస్. ఐతే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్రంలో టాప్‌లో ఉన్నారు. ఇలా ముగ్గురు నేతలకు ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయ్. ఐతే ఈ ముగ్గురు నేతల్లో.. ఎవరికీ అధికారులు సరిగ్గా రెస్పాండ్ కావట్లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో పనులు జరగడం కష్టం అవుతుందని స్థానిక కేడర్‌ అంటోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లింది.కొంత టైమ్ ఇస్తే.. అన్నీ సెట్ అవుతాయని.. రాజంపేట స్థానిక కేడర్‌కు చెప్పారట చంద్రబాబు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగబోతుండగా.. ఆ పదవులతో పాటు రాజంపేట ఇంచార్జిని కూడా నియమించే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ నడుస్తోంది. అప్పుడు కుదరకపోతే.. కడపలో జరగబోయే మహానాడులోపు రాజంపేటకు ఓ లీడర్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.నిజానికి ఎమ్మెల్యేలు, నేతలంతా జనాల్లోనే ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను జనాలకు చేరువ చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఇప్పుడు ఇంచార్జి లేకపోవడంతో రాజంపేటలో అది జరగట్లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక అటు రాజంపేటలోని పరిస్థితులను.. లోకేష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 2014లో కడప జిల్లా అంతా వైసీపీ హవా నడిచిన సమయంలోనూ.. రాజంపేటలో టీడీపీ విజయం సాధించింది.అలాంటిది కూటమి ప్రభంజనంలో నెగ్గలేకపోయింది. లోకల్‌గా లుకలుకలే దానికి కారణం అన్నది చాలామంది అభిప్రాయం. ఇప్పటికైనా రాజంపేటలో మూడుముక్కలాటకు బ్రేక్ చెప్పి.. ఇంచార్జిని నియమిస్తే సైకిల్ ట్రాక్‌లో పడే చాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Read more:Visakhapatnam:సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్

Related posts

Leave a Comment