Andhra Pradesh:రజనీ.. రోజా.. నెక్స్ట్ ఎవరు..

roja-rajini

Andhra Pradesh:రజనీ.. రోజా.. నెక్స్ట్ ఎవరు..:ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

రజనీ.. రోజా..
నెక్స్ట్ ఎవరు..

గుంటూరు, మార్చి 14
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల అవినీతి వ్యవహారాలపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నాయకులపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై లెక్కలు తేల్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.తాజాగా వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై కూడా సిఐడి అధికారులు ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి ఆర్కే రోజాపై గట్టి ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆర్కే రోజా.. అవినీతి వ్యవహారాల్లో కూడా అదే దూకుడు ప్రదర్శించారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.ప్రధానంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం లో… ఆమె క్రీడా శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లో టిడిపి నేతలు చేశారు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే రోజా విషయంలో ఇప్పటివరకు అధికారులు ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమె విషయంలో సైలెంట్ గానే ఉండిపోయింది. ఇక తాజాగా దీనిపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై సోమవారం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. దాదాపు 119 కోట్ల నిధులు ఆడదాం ఆంధ్ర పేరుతో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా బ్యాట్లు అలాగే క్రికెట్ కిట్లు కొనే విషయంలో ఆర్కే రోజా అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణలు వినిపించాయి. నాసిరకం క్రికెట్ బ్యాట్లను అప్పట్లో పంపిణీ చేశారని క్రీడాకారులు కూడా ఆరోపించారు.దీనిపై పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ బయటకు తీసి అవినీతి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అటు మరో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా కేసుల నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై గవర్నర్ అనుమతి తీసుకునేందుకు కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ఒక లేఖ కూడా రాశారు. గవర్నర్ అనుమతి వస్తే ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
అమరావతిలో కీలక పరిణామం.. ప్రభుత్వం ఫుల్ ఫోకస్
అమరావతి రాజధాని నిర్మాణం పై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అటు క్యాబినెట్ సబ్ కమిటీ సైతం కీలక సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం ప్రకటించింది. కీలక రవాణా, రైల్వే ప్రాజెక్టులను సైతం మంజూరు చేసింది. ప్రపంచం గుర్తించదగ్గ రాజధానుల్లో అమరావతిని చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ నెల 15న అమరావతి పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లో గల శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం జరగనుంది. సీఎం చంద్రబాబు తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు.2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ప్రకటించింది.

2018లో సీఎం చంద్రబాబు వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన కూడా చేశారు. అటు తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసింది. కానీ ఈ ఆలయ నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేసింది. 2022లో వైభవంగా ప్రారంభించారు ఈ ఆలయాన్ని. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అధికారుల సమీక్ష వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో.. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని టీటీడీ కార్యనిర్వాహణ అధికారి శ్యామలరావు సమీక్ష చేశారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస కళ్యాణం పై అమరావతి గ్రామాల్లో టీటీడీ ప్రచార రథం పై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అవకాశం ఉండడంతో.. ఆలయ ప్రాంగణంలో గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించామని.. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపారు. మొత్తానికైతే అమరావతిలో భారీ ఈవెంట్ కు ప్లాన్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Read more:Rajahmundry:ఇంటర్ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు

Related posts

Leave a Comment