Andhra Pradesh:బాబుపై కేడర్ గుర్రు..లోకేశ్ తో షేర్

chandra babu

Andhra Pradesh:బాబుపై కేడర్ గుర్రు..లోకేశ్ తో షేర్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నట్లు కనపడుతుంది. ఆ పార్టీ సోషల్ మీడియా లో పోస్టులు చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీకి మరింత లొంగిపోవాల్సిన అవసరం ఏముందని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే.

బాబుపై కేడర్ గుర్రు..లోకేశ్ తో షేర్

విజయవాడ, మార్చి 13
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నట్లు కనపడుతుంది. ఆ పార్టీ సోషల్ మీడియా లో పోస్టులు చూస్తుంటే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీకి మరింత లొంగిపోవాల్సిన అవసరం ఏముందని పలువురు ముఖ్య కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే. బీజేపీ సభ్యుడే అయినప్పటికీ తమ మద్దతు లేకపోతే బీజేపీ కనీసం ప్రతిపాదనకు అవసరమైన సంఖ్యాబలం కూడా లేదన్నది కార్యకర్తల వాదన. అలాంటి సమయంలో గతంలో తమపై వ్యతిరేకంగా వ్యవహరించిన సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ముందు చంద్రబాబు నాయుడు ఈ నెలలో ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అక్కడ అమిత్ షాను కలసి వచ్చారు. అప్పుడే సోము వీర్రాజు పేరు వచ్చినట్లు చెబుతున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు ఒకింత అభ్యంతరం చెప్పినప్పటికీ తమ పార్టీ వ్యవహారమని, ఇందులో తమకు సహకరించాలని అమిత్ షా కోరడంతో చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సి వచ్చిందని ముఖ్య నేతలు చెబుతున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం వినడం లేదు. సోము వీర్రాజును చంద్రబాబు వ్యతిరేకిగానే తాము భావిస్తామని, ఆయన పదవి నుంచి తొలగిన తర్వాత మాత్రమే కూటమి ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజధాని అమరావతికి కూడా నాడు వ్యతిరేకంగానే సోము వీర్రాజు పావులు కదిపారని, అప్పుడు చలో అమరావతికి పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చినా సోము వీర్రాజు కేంద్ర నాయకత్వంతో చెప్పి దానిని సమర్థంగా అడ్డుకోగలిగారన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. పైగా చంద్రబాబు వల్లనే ఏపీలో బీజేపీ బలోపేతం కాలేదన్న సోము వీర్రాజు కామెంట్స్ తో కూడిన వీడియోలు కూడా పోస్టు చేస్తున్నారు.

ఇలాంటి వ్యక్తికి సహకరించాల్సిన అవసరం ఏముందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల పార్టీ కార్యకర్తల్లోనే కాదు ఓటు బ్యాంకు గా ఉన్న జనంలో కూడా కొంత అసంతృప్తి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఇంకెంత మందికి అవకాశాలు ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి మన అవసరం ఎంత ఉందో తెలియంది కాదని, అలాగే మనకూ కేంద్ర ప్రభుత్వం అవసరం ఉందని, అంత మాత్రాన లొంగిపోవడం ఎందుకని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సోము వీర్రాజు వస్తారు. రేపు జీవీఎల్ వస్తారు. ఎల్లుండి విష్ణువర్థన్ రెడ్డి రారన్న గ్యారంటీ ఏముందంటూ చంద్రబాబును క్యాడర్ ను నిలదీస్తుండటంతో నేతల నుంచి అధినాయకత్వం వరకూ తలలు పట్టుకుంటున్నారు. కేవలం నిధుల కోసం కేంద్రం వద్ద చేతులు కట్టుకుని కూర్చుకునే కంటే అభ్యంతరం చెప్పి మరొకరికి అవకాశం ఇప్పించి ఉంటే బాగుండేదని సూచించారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు బీజేపీ చేతిలో బందీగా తయారయ్యారంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. మంత్రి నారా లోకేశ్ కు ఎక్కువ మంది క్యాడర్ తమ మనసులో బాధను చెప్పుకుంటుండటం విశేషం.

Read more:Andhra Pradesh:నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి..?

Related posts

Leave a Comment