Andhra Pradesh:ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనుంది. అందుకోసం ఏజెన్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 11వ తేదీన తుది గడువుగా నిర్ణయించింది. గడువులోగా దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో ఒక దాన్ని ఎంపిక చేయనుంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ప్రచారం చేసేందుకు సమర్థవంతమైన ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు
విజయవాడ, మార్చి 4
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించనుంది. అందుకోసం ఏజెన్సీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 11వ తేదీన తుది గడువుగా నిర్ణయించింది. గడువులోగా దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో ఒక దాన్ని ఎంపిక చేయనుంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ప్రచారం చేసేందుకు సమర్థవంతమైన ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కమ్యూనికేషన్ ఏజెన్సీ ఎంపిక కోసం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు మార్చి 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. దరఖాస్తు చేసుకోవాల్సిన ఏజెన్సీలకు కొన్ని నిబంధనలను నిర్దేశించింది.ఆసక్తిగల ఏజెన్సీలు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున గత మూడేళ్లు టర్నోవర్ కలిగి ఉండాలి. అలాగే కనీసం 100 మంది జర్నలిజం, మీడియాలో నిష్ణాతులైన ఉద్యోగులు ఉండాలనే నిబంధనలు విధించింది. వీటితో పాటు సమాచార శాఖ అధికారులు పలు నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనలకు సరిపోయిన ఏజెన్సీలు మాత్రమే ప్రభుత్వానికి ప్రచారం చేసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. ఆ నిబంధనలు లేకపోతే, అటువంటి ఏజెన్సీలు తిరస్కరణకు గురవుతాయి.
ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే జనవరిలోనే కమ్యూనికేషన్ ఏజెన్సీ ఏర్పాటుపై ప్రకటన విడుదల చేసినప్పటికీ, పరిపాలన పరమైన అంశాల్లో సరవణలు చేసి మళ్లీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.ఎంపికైన ఏజెన్సీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సంప్రదాయ మీడియాతో పాటు దురదర్శన్, రేడియో, సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు ఇతర ప్రముఖ భాషల్లోనూ ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ పాలన, అభివృద్ధిపై కథనాలను ఆయా మీడియాల్లో వచ్చేలా చూడాలి.మీడియా కవరేజ్, ట్రాకింగ్, విశ్లేషణ చేయడంతో పాటు వివిధ శాఖలకు చెందిన వార్తలను మీడియా సంస్థలకు తెలియజేయాల్సి ఉంటుంది. అవసరం మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మీడియా ప్రముఖులతో ట్రిప్లను నిర్వహించాలి. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల ఇంటర్వ్యూలు ప్రముఖ వార్తా పత్రికలు, టీవీలు, ఎఫ్ఎం రేడియో చానళ్లలో వచ్చేలా చూడాలి. దేశ, విదేశాల్లోని మీడియా రంగ ముఖ్యలతో ప్రభుత్వ సమావేశాల గురించి తెలియజేయాలి. ప్రభుత్వ సానుకూల, ప్రతికూలతలపై ప్రజాభిప్రాయం సేకరించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా వ్యూహాలను సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
Read more:Andhra Pradesh:పోసానిపై 20కు పైగా కేసులు.. స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి