Andhra Pradesh:పోసానిపై 20కు పైగా కేసులు.. స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి:సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో పథ్నాలుగు కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు.
పోసానిపై 20కు పైగా కేసులు
స్టేషన్స్ టూర్ లో కృష్ణమురళి
విజయవాడ, మార్చి 4
సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, శ్రీకుకుళం, విజయవాడ వంటి చోట్ల కేసులు నమోదయ్యాయి. దాదాపు 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే ఇందులో పథ్నాలుగు కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పోసాని కృష్ణమురళిపై వరస కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకదాని తర్వాత మరొక కేసు పోసాని మెడకు చుట్టుకుంటుంది.గత వైసీపీ అధికారంలో ఉన్నప్పడు పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ నేడు ఆయన పాలిట శాపంగా పరిణమించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో పాటు వారి కుటుంబసభ్యులను దూషించిన కేసులు వరసగా నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదులు చేసినా నాడు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరస కేసులు పోలీసులు నమోదవుతున్నాయి. దీంతో పోసాని కృష్ణమురళిని ఏపీ అంతటా తిప్పుతూ జైళ్లను మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే పథ్నాలుగు నుంచి పదిహేడు కేసులు నమోదయ్యాయి. రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని కృష్ణమురళిని ప్రస్తుతం పీటీ వారెంట్ పై నరసరావుపేటకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరొకచోటకు.. ఇలా ఏపీ అంతా ఆయనపై కేసులు నమోదు కావడంతో దాదాపు అన్ని సబ్ జైళ్లను చూపించే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరొక కేసు రెడీగా ఉండటంతో ఆయన నాలుగు గోడల మధ్య నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30 పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్గా మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకి వెళ్లారు. గుంటూరుజిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. పోసానిని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. పోసానిని అప్పగిస్తే తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారట.మూడు జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో.. ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు.. పీటీ వారెంట్లు పోసానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.పోసానితో పాటు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని ఒక మూర్ఖుడు. పోసాని లాంటి వాళ్లతో అప్పుడు తిట్టించి ఇప్పుడు గగ్గోలు పెడతారా? అని నిలదీశారు. తప్పు చేసిన వాళ్లను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారుమొత్తం మీద పోసాని ఏపీ టూర్ వేయక తప్పదన్న సెటైర్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.
Read more:Andhra Pradesh:ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్