Andhra Pradesh:నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి..?

Nagababu to be Minister of Cinematography.

Andhra Pradesh:నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి..?:జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్లు వేయడం, స్క్రూటినీలో అన్నీ నామినేషన్లు సక్రమంగా ఉండటంతో ఇక ఎన్నికల అధికారి ప్రకటించడమే తరువాయి. అయితే తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటు పవన్ కల్యాణ్, అటు చంద్రబాబు నాయుడు బహిరంగంగానే చెప్పారు.దీంతో ఎన్నికయిన తర్వాత ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నాగబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి..?

విజయవాడ, మార్చి 13
జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఐదు స్థానాలకు ఐదుగురే నామినేషన్లు వేయడం, స్క్రూటినీలో అన్నీ నామినేషన్లు సక్రమంగా ఉండటంతో ఇక ఎన్నికల అధికారి ప్రకటించడమే తరువాయి. అయితే తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటు పవన్ కల్యాణ్, అటు చంద్రబాబు నాయుడు బహిరంగంగానే చెప్పారు.దీంతో ఎన్నికయిన తర్వాత ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అయి నాగబాబు అమాత్యుడిగా మారనున్నారు.ఇక నాగబాబుకు ఇచ్చే పోర్ట్ ఫోలియోపైనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. ఆ స్థానం నాగబాబు కోసమే రిజర్వ్ చేశారని అందుకే జులైలో ఏర్పాటయిన మంత్రివర్గంలో ఒకటి ఖాళీగా ఉంచారని చెబుతున్నారు.

తొలుత రాజ్యసభ అనుకున్నప్పటికీ దానికంటే మంత్రివర్గంలో ఉంటేనే జనసేనను మరింత బలోపేతం చేయవచ్చని పవన్ కల్యాణ్ భావించి ఈ మేరకు ఆయనను ఎగువ సభకు పంపడం కంటే రాష్ట్రానికే పరిమితం చేయాలని నిర్ణయించి ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ఆయన కూడా అందుకు అంగీకరించారు. అయితే నాగబాబుకు ఇప్పుడు ఏ మంత్రి పదవి ఇస్తారన్నది చర్చనీయాంశమైంది. నాగబాబుకు సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖ ఇవ్వరన్నది గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే తమ కుటుంబంలో టాలీవుడ్ లో ఎక్కువ మంది ఉండటం, వారు నటులుగా ఉండటంతో ఆ శాఖను తీసుకునేందుకు నాగబాబు కానీ, పవన్ కల్యాణ్ కూడా అంగీకరించరు. దీంతో క్రీడలు, యువజన సర్వీసుల శాఖను నాగబాబుకు కేటయిస్తారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. ప్రస్తుతం ఈ శాఖను రాజంపేటకు చెందిన మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చూస్తున్నారు. వీటితో పాటు ప్రధానమైన రవాణా శాఖను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయనను రవాణాశాఖకు మాత్రమే పరిమితం చేసి నాగబాబును క్రీడలు, యువజన సర్వీసుల శాఖను అప్పగిస్తే ఇటు పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఇదేశాఖ కేటాయిస్తారన్న ప్రచారం అసెంబ్లీలో లాబీయింగ్ జరుగుతుంది.

Read more:Telangana: ఘనంగా జిల్లా పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

Related posts

Leave a Comment