Andhra Pradesh:నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ:ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం.
నవనగరాల నిర్మాణాల పూజకు మోడీ
అమరావతి, మార్చి 15
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు పోలవరం, రెండోవైపు అమరావతిని పరుగులు పెట్టించే పనిలో ఉంది. కేంద్రంలోని ప్రభుత్వ సహకారంతో నిధులకు కొరత లేకుండా చూసుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఫైనలైజ్ అయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించింది. ఇప్పుడు వివిధ దశల్లో ఆగిపోయిన నిర్మాణాలూ పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచింది. గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలించింది. వాటిని ఫైనలైజ్ చేసింది. అమరావతి నిర్మాణంలో భాగంగా సగంలో ఆగిపోయిన బిల్డింగ్స్‌ను పూర్తి చేస్తూనే కొత్త నిర్మాణ పనులు చేపట్టనుంది. అందులో భాగంగా నవ నగరాల శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయబోతోంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించబోతోంది. ఆయన ఇచ్చే షెడ్యూల్ ఆధారంగా ముహూర్తం ఖరారు చేయనున్నారు. నవనగరాల శంకుస్థానకు ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య ప్రధానమంత్రి రానున్నారు. ఇంకా షెడ్యూల్ ఫైనల్ కాలేదు. ఒకసారి పీఎవో నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనుంది. ఇప్పటికే ఈ విషయం గురించి చంద్రబాబు చూచాయిగా చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. క్యాపిటల్ సిటీలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించాని ఏపీ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
అయితే ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిదశలో రాజధానిలో నిర్మాణాల కోసం, మౌలకి సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ రూ.64,721 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారు చేసింది. అయితే ఈ నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. మార్చి 17న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.అయితే ఈ సమావేశంలో వీటికి ఆమోదం లభించిన తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించనున్నాయి. ఇదిలాఉండగా 2014లో చంద్రబాబు ఏపీకీ సీఎం అయినప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ వాటి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతిలో పనులు ఆగిపోయాయి. అప్పటి సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడంతో రాజధాని నిర్మాణానికి అడుగులు పడలేదు. చివరికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధానిగా అమరావతినే నిర్ణయించారు. దీంతో అక్కడ పనులు పునఃప్రారంభమయ్యాయి. అమరావతికి పునాది రాయి వేసింది మోదీ అని తర్వాత దశల్లో కూడా ఆయన సహాకరం, ఆశీస్సులతోనే నిర్మాణాలు పూర్తి అవుతాయని అసెంబ్లీలోనే ప్రకటించారు. నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్ట సంస్థలకు పనులు అప్పగించే ప్రక్రియకు ఆమోదం తెలపనున్నారు. అనంతరం టెండర్లు దక్కించుకున్న సంస్థలకు పనులు ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. వారికి లెటర్లు పంపిస్తారు. అనంతరం అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి.
Read also:ఖజానా నిల్… బిల్లులు ఫుల్…
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఆర్థిక శాఖతో తలెత్తిన వివాదం నేపథ్యంలో పలు అంశాలు తెరపైకి వచ్చాయి. బిల్లుల చెల్లింపుపై ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానం అమలు చేయాలని కాంట్రాక్టర్లు మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు.సీఎఫ్‌ఎంఎస్ విధానంలో అమలు చేస్తున్న విధానాల్లో లోపాలను కాంట్రాక్టర్లు ఎత్తి చూపుతుంటే తమ చేతుల్లో ఏముందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 7వేల మంది కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3వేల కోట్ల రుపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్చి నెలాఖరులోగా బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చేయడం కోసం బకాయిల్లో కొంత మేరకు విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.ఏపీలో కాంట్రాక్టర్లు చేపట్టిన హై ఇంపాక్ట్ పనులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పనులు, పోలవరం పునరావాస కాలనీల నిర్మాణం, పీహెచ్‌సీల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, కాల్వల మరమ్మతులు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, హౌసింగ్, డ్రైనేజీ వంటి పనులు కూడా చేశారు.గత ఐదేళ్లలో చేపట్టిన పనులతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలుగా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు కూడా భారీగా బకాయి పడ్డారు. నియోజక వర్గాల్లో అత్యవసరం చేపట్టాల్సిన పనుల్ని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో ఆగమేఘాలపై పనులు అప్పగించి పూర్తి చేయించారు.బిల్లుల చెల్లింపు వ్యవహారంలో గత ఐదేళ్లుగా కొత్త పద్ధతులు మొదలయ్యాయి.
ముందు పూర్తి చేసిన పనులకు ముందుగా చెల్లించే విధానానికి తిలోదకాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నారు. బడా కాంట్రాక్టు సంస్థలకు మాత్రమే చెల్లింపులు చేస్తూ చిన్నాచితక కాంట్రాక్టర్లను వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్వోసిల నుంచి చెల్లింపుల వరకు కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపై కాంట్రాక్టర్లలో అసహనం నెలకొంది.ఈ క్రమంలో రాయలసీమలోని చిత్తూరు, కడప, పులివెందులలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం వెలుగు చూసింది. అయా ప్రాంతాల్లో చేపట్టిన పనుల్ని క్యాపిటల్ హెడ్స్ నుంచి నిధులు కేటాయించడంతో ప్రభుత్వం మారినా వాటికి నిధుల కొరత లేకుండా చెల్లింపులు జరిగిపోయినట్టు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ బాధ్యులు సూచించిన వారికి మాత్రమే చెల్లింపులు జరిగాయని, గత ప్రభుత్వంలో నష్టపోయినట్టే ఇప్పుడు కూడా చిన్న కాంట్రాక్టర్లు రోడ్డున పడుతున్నారని చెబుతున్నారు. కాంట్రాక్టర్లకు ఏప్రిల్ వరకు బిల్లులు చెల్లించలేమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చి చెప్పడం కాంట్రాక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. బిల్లుల చెల్లింపు ప్రాధాన్యతలు ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఇందులో ఆర్థిక శాఖ పాత్ర నామమాత్రంగా ఉందని చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు కోరుతూ ఆర్థిక శాఖకు కాంట్రాక్టర్లు వచ్చినపుడు కూడా ప్రభుత్వ పెద్దలను సంప్రదించాలని సెక్రటరీ సూచించినట్టు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక స్థితి బిల్లులకు చెల్లింపుకు అనువుగా లేదని,ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకు అతి కష్టమ్మీద నిధులు సమీకరిస్తున్నట్టు వివరించినట్టు చెబుతున్నారు. కాంట్రాక్టర్ల సమస్యపై అధికారులకు సానుభూతి ఉన్నా ఖజానా ఉన్న పరిస్థితుల్లో చెల్లింపులపై సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని ఏపీ ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.కొందరికే చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణల్ని కూడా ఆర్థిక శాక వర్గాలు తోసిపుచ్చాయి. ప్రాధాన్యత క్రమంలో అందరికి పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తున్నట్టు చెప్పారు. 2014-19 మధ్య కాలంలో పెండింగ్ ఉన్న బిల్లుల్ని ఇప్పుడు క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. బిల్లులు ఎవరికి చెల్లించాలనే నిర్ణయం అధికారుల వద్ద ఉండదనే సంగతి కాంట్రాక్టర్లకు కూడా తెలుసని, ప్రభుత్వంతోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని సూచిస్తున్నారు.
Read more:Hyderabad:సైకిల్ ఎంట్రీ.. మారనున్న గేర్