Andhra Pradesh:దువ్వాడ వాణి..అస్సలు తగ్గట్లేదుగా:ఏపీలో పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సినీ సెలబ్రిటీస్ కి మించి విపరీతమైన పాపులారిటీ సాధించింది ఈ జంట. ఈ జంట కోసం మీడియా సైతం పరితపిస్తోంది. ఒకవైపు వ్యాపార విస్తరణలో ఉన్న ఈ జంట.. అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూలో కనిపిస్తోంది. జనాలకు వినోదం పంచుతోంది. టీవీ ఛానల్ లకు టీఆర్పి రేట్లు పెంచుతోంది. అందుకే వీరిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఛానళ్లు సైతం క్యూ కడుతున్నాయి. మొన్న ఆ మధ్యన రిపీటేటెడ్ న్యూస్ ఛానల్ సైతం ఈ జంటను ఇంటర్వ్యూ చేసేందుకు విలువైన సమయాన్ని కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
దువ్వాడ వాణి..అస్సలు తగ్గట్లేదుగా
శ్రీకాకుళం, మార్చి 13
ఏపీలో పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సినీ సెలబ్రిటీస్ కి మించి విపరీతమైన పాపులారిటీ సాధించింది ఈ జంట. ఈ జంట కోసం మీడియా సైతం పరితపిస్తోంది. ఒకవైపు వ్యాపార విస్తరణలో ఉన్న ఈ జంట.. అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూలో కనిపిస్తోంది. జనాలకు వినోదం పంచుతోంది. టీవీ ఛానల్ లకు టీఆర్పి రేట్లు పెంచుతోంది. అందుకే వీరిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఛానళ్లు సైతం క్యూ కడుతున్నాయి. మొన్న ఆ మధ్యన రిపీటేటెడ్ న్యూస్ ఛానల్ సైతం ఈ జంటను ఇంటర్వ్యూ చేసేందుకు విలువైన సమయాన్ని కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు దివ్వెల మాధురిముందుగా ఒంటరిగా వచ్చారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ రాకపోవడానికి సంబంధిత హోస్ట్ ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాసుతో విభేదాలు వచ్చాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయని.. అందుకే దువ్వాడ శ్రీనివాస్ రాలేదా అంటూ ప్రశ్నించారు. అయితే వెను వెంటనే తన సెల్ ఫోన్ తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేశారు మాధురి. ఎక్కడ ఉన్నారంటూ అడిగేసరికి.. సిటీలో ఉన్నానని చెప్పుకొచ్చారు.
వెంటనే అక్కడకు రావాలా అంటూ ప్రశ్నించారు. అక్కడకు కొద్దిసేపటికే ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తమను పక్కన పెట్టారన్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదన్నారు దువ్వాడ. తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తమ వ్యక్తిగత జీవితం అని చెప్పుకున్నారే తప్ప.. ఎప్పుడు కలుగజేసుకున్న దాఖలాలు లేవని కూడా తేల్చి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. అదే సమయంలో మాధురి తన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టారు. త్వరలో తాను సినిమాల్లోకి రాబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కే జి ఎఫ్ తరహాలో సినిమా చేస్తానని కూడా తేల్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ రాక మునుపే.. తన నటన కౌశల్యంతో మెప్పించారు. అటు ఇటుగా వాక్ చేస్తూ అలరించారు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటూ తెగేసి చెప్పారు
ఏ క్షణమైనా దువ్వాడ అరెస్ట్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయన అరెస్టు తప్పదని సమాచారం. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు కేసులు పెట్టారు.ప్రభుత్వ హయాంలో అప్పటి జనసేన అధినేత, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలుమార్లు దూషించారు దువ్వాడ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయనపై తిట్లు అందించారు కూడా. అయితే అప్పట్లో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొద్దిసేపు ఉండి బయటకు వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
వాటిపైనే జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి.ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించలేదని.. ఆయన మారువేషంలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు దువ్వాడ శ్రీనివాస్. అంతటితో ఆగకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండేందుకు చంద్రబాబు నెలకు 50 కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ కు చెల్లిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు. అరెస్టుకు సిద్ధంగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ కు సవాల్ చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు, తాజాగా చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పోసాని కృష్ణ మురళి అరెస్టు కూడా జరిగింది. ఆయనపై సైతం కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది. ఈ తరుణంలో నెక్స్ట్ అరెస్టు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.