Andhra Pradesh:తిరుపతి మేయర్ పై అవిశ్వాసం:కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్పులు జరుగుతున్నాయి. తిరుపతిలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 3 లక్షలపైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. 2020లో కొవిడ్ ప్రారంభ సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ధన, ఆర్థిక, అంగ బలంతో 50 డివిజన్లలో 25శాతం మాత్రమే ఎన్నికలు జరిగేలా చేసింది.
తిరుపతి మేయర్ పై అవిశ్వాసం
తిరుపతి, ఫిబ్రవరి 22
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్పులు జరుగుతున్నాయి. తిరుపతిలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో 3 లక్షలపైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 50 డివిజన్లు ఉన్నాయి. 2020లో కొవిడ్ ప్రారంభ సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ధన, ఆర్థిక, అంగ బలంతో 50 డివిజన్లలో 25శాతం మాత్రమే ఎన్నికలు జరిగేలా చేసింది. అప్పట్లో కనీసం నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వారి డాక్యుమెంట్లు సైతం లాకెళ్లిన ఘటనలు చూశాం. ఆ సన్నివేశాలను పోలీసులు చూస్తు ఉన్నారు తప్ప ఏమి చేయలేని పరిస్థితి. నామినేషన్లు దాఖలు చేసిన వారివి సైతం పత్రాలు చింపేసి అధికారులను అడ్డం పెట్టుకుని మరీ ఏకగ్రీవాలు చేశారు. ఆ సమయంలో కొవిడ్ కారణంగా లాక్ డౌన్ రావడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవిడ్ పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు 50గాను 48 సొంత చేసుకున్నారు. 1 మాత్రమే టీడీపీ కైవసం చేసుకోగ.. 1 డివిజన్ కార్పొరేటర్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికలు లేకుండా పోయింది.50 మంది కార్పొరేటర్లు మేయర్‌గా బీసీ (యాదవ) వర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్ర నారాయణను నిలబెట్టారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండో డిప్యూటీ మేయర్ కోసం జీవో విడుదల చేయగా రెండో డిప్యూటీ మేయర్‌గా అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని ఎన్నుకున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో వైసీపీ తరపున కార్పొరేటర్లు నోరు సైతం మెదపకుండా వారికి కావాల్సింది చేసుకుంటూ కౌన్సిల్ సమావేశం మీడియా సైతం అనుమతి లేకుండా పాలన సాగించారు. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 60వేల పైగా మెజారిటీతో గెలుపొందారు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 కార్పొరేటర్లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత కొంత మంది కార్పొరేటర్లు సైతం వైసీపీ వీడి కూటమి వైపు మొగ్గు చూపినా తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అప్పటి వరకు బాగానే ఉన్నా మేయర్ తన పదవితో ఎమ్మెల్యే సహా ఎవర్నీ మాట్లాడనీయకుండా చేశారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కార్పొరేటర్లను టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి కారణంగా రెండో డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి రాజీనామా చేశారు. డిప్యూటీ మేయర్ పోస్టు ఖాళీ కావడంతో ఇటీవల డిప్యూటీ మేయర్ పోస్టుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ డ్రామా మధ్యే 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ ముని కృష్ణ డిప్యూటీ మేయర్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక తరువాత తొలి తిరుపతి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్‌గా ఆర్సీ ముని కృష్ణ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తరువాత బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం అజెండా అంశాలు చర్చకు వచ్చాయి. తన ముందే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అధికారులు దౌర్జన్యానికి దిగారని వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ డాక్టర్ శిరీష డిమాండ్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన కమిషనర్ మౌర్య క్షమాపణ చెప్పి ఏమి జరిగిందో విచారణ చేస్తామని చెప్పారు. అయితే దానికి సంతృప్తి చెందని మేయర్ కౌన్సిల్ నుంచి బాయ్ కాట్ చేశారు. దీంతో ఏమి చేయాలో తెలియక… కోరం నిర్ణయం మేరకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు డిప్యూటీ మేయర్ గా ఉన్న ముద్ర నారాయణను మేయర్ గా పెట్టి కౌన్సిల్ పూర్తి చేశారు.తిరుపతి మేయర్ ఉన్న అక్రమంగా భవనాలకు ఎలా అనుమతి ఇచ్చారు. ఇంత కాలం ఏమి చేశారు. అధికారుల పై చర్యలు గతంలో ఎందుకు తీసుకోలేదని కార్పొరేటర్లు చర్చకు దిగారు. మేయర్ హోదాలో సభ నుంచి బాయ్ కాట్ చేయడం ఏంటని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటే అవిశ్వాసం పెట్టి ఆమెను పదవి నుంచి తొలగించాలని పావులు కదుపుతున్నారు. బీసీ (యాదవ్) సామాజికవర్గానికి చెందిన అన్నా అనిత, అన్నిత సంధ్య మేయర్ పదవి కోసం ఎదురుచూస్తుండగా ఇదే అదునుగా భావించి మరింత వేగంగా కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. మార్చి నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్‌పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. మిగిలిన 8 నెలల కాలంలో మేయర్ పదవి సొంతం చేసుకోవడం వల్ల ఏమి లాభం ఉంటుందనేది కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏమి జరుగుతుందో మార్చి వరకు వేచి చూడాల్సిందే.
Read more:Andhra Pradesh:లగడపాటి దారిలో కేశినేని నాని, కాకపోతే చిన్న ట్విస్ట్