Andhra Pradesh:జనసేన గూటికి దువ్వాడ వాణి

Will Duvvada Srinivas' wife Vani join Janasena?

Andhra Pradesh:జనసేన గూటికి దువ్వాడ వాణి:దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి జనసేనలో చేరతారా? ఆ ప్రయత్నాల్లో ఉన్నారా? జనసేన అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పిటిసిగా ఉన్నారు. ఆ పార్టీ మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె జనసేనలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

జనసేన గూటికి దువ్వాడ వాణి

విజయనగరం, ఫిబ్రవరి 25
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి జనసేనలో చేరతారా? ఆ ప్రయత్నాల్లో ఉన్నారా? జనసేన అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దువ్వాడ వాణి ప్రస్తుతం టెక్కలి జడ్పిటిసిగా ఉన్నారు. ఆ పార్టీ మహిళా నేతగా కొనసాగుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె జనసేనలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల కిందట దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకు దారితీసింది. భార్య వాణి తో పాటు పిల్లలు దువ్వాడ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. కొత్త ఇంటిని తమ పేరున రాయాలని డిమాండ్ చేశారు. అదో సీరియల్ ఎపిసోడ్ లా నడిచింది. అయితే చివరకు దువ్వాడ శ్రీనివాస్ తన సన్నిహితురాలు మాధురికి ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ రంగంలో కూడా కొనసాగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దువ్వాడ వాణి కోరుతూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వినలేదు. దానికి సమ్మతించలేదు. అందుకే దువ్వాడ వాణి జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఆమెకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.

ఆమె తండ్రి సంపతి రావు రాఘవరావు ఎంపీపీగా వ్యవహరించారు. ఆయన అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. గతంలో దువ్వాడ వాణి టెక్కలి ఎంపీపీగా, జడ్పిటిసి గా కూడా వ్యవహరించారు. సమకాలిన రాజకీయ అంశాలపై మంచి అవగాహన ఉంది. అందుకే ఆమె జనసేన లో చేరతారని తెలుస్తోంది.2024 ఎన్నికలకు ముందు దువ్వాడ వాణిని)టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. కుటుంబంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో తప్పుకున్నారు. అతని బదులు భార్య వాణికి ఇన్చార్జ్ పోస్ట్ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు దువ్వాడ వాణి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలుగజేసుకోవడంతో శాంతించారు. అయితే మొన్న భర్తతో జరిగిన వివాదం నేపథ్యంలో దువ్వాడ వాణి ఎన్నికల్లో టిడిపికి మద్దతు తెలిపారని శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికీ దువ్వెల మాధురి అదే మాట చెబుతున్నారు. టెక్కలిలో దువ్వాడ వాణి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారని ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే దువ్వాడ వాణికి అవకాశం లేకుండా పోతుంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే దువ్వాడ వాణి జనసేన లో చేరాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అటు బలమైన సామాజిక వర్గం, ఆపై రాజకీయ అనుభవం ఉండడంతో వాణిని జనసేనలోకి తీసుకునేందుకు నాయకత్వం సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. అప్పట్లో భర్త వెంట దువ్వాడ వాణి కూడా పిఆర్పి లో చేరారు. మెగా కుటుంబంతో ఉన్న సంబంధాల దృష్ట్యా జనసేనలో చేరడమే మేలని వాణి సైతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more:Kakinada:క్యూ ఆర్ కోడ్ తో రేషన్

Related posts

Leave a Comment