Andhra Pradesh:జగనన్న కాలనీలపై మళ్లీ సర్వే: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసిపి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పున: సమీక్షిస్తోంది. అందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పింఛన్లలో అనర్హులను తొలగిస్తూ వస్తోంది. ప్రతి నెల అందించే పింఛన్ లబ్ధిదారులు తగ్గుముఖం పడుతూ వస్తున్నారు. ఇప్పుడు వైసిపి హయాంలో ఇంటి పట్టాల్లో బినామీలను బయటకు తీసే పనిలో పడింది. అటువంటి వారి ఇళ్ల పట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.
జగనన్న కాలనీలపై మళ్లీ సర్వే
నెల్లూరు, ఫిబ్రవరి 10
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసిపి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పున: సమీక్షిస్తోంది. అందులో భాగంగా సంక్షేమ పథకాల్లో అనర్హులను ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పింఛన్లలో అనర్హులను తొలగిస్తూ వస్తోంది. ప్రతి నెల అందించే పింఛన్ లబ్ధిదారులు తగ్గుముఖం పడుతూ వస్తున్నారు. ఇప్పుడు వైసిపి హయాంలో ఇంటి పట్టాల్లో బినామీలను బయటకు తీసే పనిలో పడింది. అటువంటి వారి ఇళ్ల పట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా అనర్హులు భయపడుతున్నారు.గత వైసిపి (ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు అందించారు. జగనన్న కాలనీ లేఅవుట్ల పేరిట లబ్ధిదారులకు సెంటున్నర స్థలం అందించారు. అయితే చాలా చోట్ల నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో పట్టాలు అందించినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో ఊరికి దూరంగా, స్మశాన వాటికల వద్ద వైసీపీకి చెందిన వారి భూములను కొనుగోలు చేసి ఇళ్లపట్టాలుగా అందించినట్లు విమర్శలు వచ్చాయి. ఇందులో పెద్ద మొత్తంలో వైసీపీ నేతలకు లబ్ధి చేకూరినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. స్థానిక వైసీపీ నేతలు బినామీలుగా మారి పట్టాలు అందుకున్నట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నడిచింది. అయితే ఇటువంటి చోట్ల చాలామంది లబ్ధిదారులు ఇళ్లు కట్టలేదు. నివాసయోగ్యం కానీ ప్రాంతాలుగా పరిగణించి చాలామంది ముందుకు రాలేదు. దీంతో ఈ కాలనీ లేఅవుట్లు వృధాగా ఉన్నాయి.జగనన్న కాలనీ లేఅవుట్లను( ఇటీవల ప్రభుత్వం పేరు మార్చింది. ఈ నేపథ్యంలో అనర్హులకు సంబంధించి ఇళ్ల పట్టాలను రద్దు చేసింది. దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకుగాను నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అప్పట్లో చాలామంది అనర్హుల సైతం పట్టాలు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ. గ్రామీణ ప్రాంతాల కంటే నగరాలు, పట్టణాల చెంతన భూముల ధరలు ఎక్కువగా ఉన్న చోట్ల అనర్హులు పట్టాలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వాస్తవం అని తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనర్హులను తేల్చే పనిలో పడింది. అందుకే అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అయితే లబ్ధిదారులకు సంబంధించిన సర్వే ప్రారంభం కానుంది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువమంది పట్టాలు పొందారా? అనే కోణంలో అధికారులు వివరాలు సేకరించనున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సుమారు 22.80 లక్షల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేయగా.. సుమారు 7 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు సమాచారం. అధికారుల విచారణ ప్రక్రియ పూర్తయితే కానీ పట్టాల పంపిణీలో అనర్హులకు చోటు దక్కిందా? లేదా? అన్నది తేలే అవకాశం లేదు. మొత్తం మీద వైసిపి హయాంలో కీలకమైన ఇళ్లపట్టాల పథకంపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేయడం విశేషం.
Read more:Guntur:పల్పాడులో పొలిటికల్ హీట్