Andhra Pradesh:చింతమనేని చిరాకులేల

Andhra Pradesh-chintamaneni-prabhakar

Andhra Pradesh:చింతమనేని చిరాకులేల:దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ లీడర్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఆయన వివాదంలో లేకపోతేనే ఆశ్చర్యపోవాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని రూటే వేరు.

చింతమనేని చిరాకులేల

ఏలూరు, ఫిబ్రవరి 17
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ బ్రాండ్ లీడర్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఆయన వివాదంలో లేకపోతేనే ఆశ్చర్యపోవాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా చింతమనేని రూటే వేరు. తనపై అటెన్షన్ ఉండాలని చింతమనేని ఆకాంక్షిస్తారని భావించాలి. అందుకే తరచూ వివాదాలే రాజకీయంగా ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారాయన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచి వినపడుతున్నాయి. చింతమనేని ప్రభాకర్ సీనియర్ రాజకీయ నాయకుడు. 2019 ఎన్నికల్లో చింతమనే ప్రభాకర్ దెందులూరు నుంచి ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. జైలుకు కూడా వెళ్లి వచ్చారు నేతలకు దిశానిర్దేశం నాడు పార్టీని ఇబ్బందుల్లో… 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మార్వో వనజాక్షిని బెదిరించిన వైనం చింతమనేని ప్రభాకర్ ను రాజకీయంగా ఇబ్బందులపాలు చేసింది. అంతేకాదు పార్టీ ప్రతిష్టను కూడా దిగజార్చింది. అయినా తగ్గేదేలే అన్నట్లు ఆయన తీరు ఉంటుంది. చింతమనేని ప్రభాకర్ నిత్యం ప్రజల్లో ఉంటారు. అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కొంత మంచిపేరు తెచ్చుకుంటారు. కానీ ఆ మంచి పేరు వివాదాలతోనే తనకు తానే చెరిపేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని మాత్రమే నమ్ముకున్న చింతమనేని 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా హాట్ కామెంట్స్ చేసి ఒకవర్గానికి దూరమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీలో ఇప్పటికీ వినిపిస్తున్నాయ.

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ నేతగా ఉన్న ప్పటికీ ఆయనకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు దక్కలేదు. 2009, 2014లో వరసగా దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ కోసం జెండా వదలలేదు. కార్యకర్తలకు అండగా నిలబడటంలో ముందున్నారు. అనేక కేసులు తనపై నమోదవుతున్నా చింతమనేని ప్రభాకర్ బెదరలేదు. భయపడలేదు. అలాగే అధికార పార్టీకి తలవంచే నైజం కాదు. అదే చింతమనేని ప్రభాకర్ లో ప్లస్ పాయింట్ అని తెలుగు తమ్ముళ్లు అంటారు? తాజాగా మరో వివాదం… తాజాగా మరో వివాదం ఆయన తన నెత్తిమీదకు తెచ్చుకున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని ప్రభాకర్ తనకారుకు అడ్డంగా నిలిపారని స్వయంగా తానే దిగి డ్రైవర్ ను దుర్భాషలాడిన వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వాహనం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిది కావడంతోనే అసలు సమస్య. దీంతో పార్టీ అధినేత చంద్రబాబును కలసి జరిగిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని కూడా జైలుకు వెళతారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరికొందరు నేతలు జైలుకు వెళతారన్న చింతమనేని అబ్బయ్య చౌదరి సాఫ్ట్ వేర్ కాదని, హార్డ్ వేర్ అని అన్నారు. మొత్తం మీద మరోసారి చింతమనేని వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారడంతో పార్టీ నేతలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చింతమనేనికి క్లాస్ పీకినట్లు తెలిసింది.

Read more:Andhra Pradesh:ఆచితూచి వ్యవహరిస్తున్న కాపులు

Related posts

Leave a Comment