Andhra Pradesh:గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్:ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలను .నారాయణ ప్రకటించారు. వంద గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలుకుని అపార్ట్‌మెంట్ల నిర్మాణం వరకు భవన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు నిర్ణయాలను ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదు. తాజాగా గత వారం హైకోర్టు ఆదేశాలతోొ పురపాలక శాఖ భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేసింది.
గందరగోళంగా మారిన టౌన్ ప్లానింగ్
నెల్లూరు, మార్చి 5
ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పేది ఒకటి ఆ శాఖలో జరిగేది మరొకటి… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలను .నారాయణ ప్రకటించారు. వంద గజాల్లోపు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మొదలుకుని అపార్ట్‌మెంట్ల నిర్మాణం వరకు భవన నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు నిర్ణయాలను ప్రకటించారు. అయితే మంత్రి నారాయణ చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదు. తాజాగా గత వారం హైకోర్టు ఆదేశాలతోొ పురపాలక శాఖ భవన నిర్మాణ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పిన దానికి ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. దీనిపై భవన నిర్మాణ రంగంలో ఉన్న వారి నుంచి బహిరంగంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తాజాగా భవన నిర్మాణదారుల కోసం అందుబాటులోకి వచ్చిన కొత్త సాఫ్ట్ వేర్ తీసుకొచ్చినట్టు మంత్రి నారాయణ ప్రకటించారు. 18 మీటర్ల ఎత్తు లోపు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ పత్రం సరిపోతుందని టౌన్ ప్లానింగ్ అధికారులతో సంబంధం లేకుండా సరైన పత్రాలు సమర్పిస్తే ఆటోమెటిక్ గా అనుమతులు మంజూరవుతాయని ప్రకటించారు. ఈ విధానం 2019 నాటికి విజయవాడలో అమల్లో ఉంది. అయితే ఆటోమెటిక్ అనుమతుల జారీ విధానాన్ని పూణేకు సంబంధించిన కంపెనీకి అప్పట్లో అప్పగించారు. ప్రభుత్వం భవన నిర్మాణదారులకు ఎవరి జోక్యం లేకుండా ఈ అనుమతులు జారీ చేసే ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడితే అందులో కూడా టౌన్ ప్లానింగ్ వేలు పెట్టింది.కార్పొరేషన్ల పరిధిలో అధికారుల్ని ప్రసన్నం చేసుకుంటేనే ఆన్‌లైన్‌లో అనుమతి జారీ అయ్యేలా మార్పులు చేశారు. దీంతో గత ఐదేళ్లలో భవన నిర్మాణదారులు నరకం అనుభవించారు. అన్ని రకాల ఫీజులు చెల్లించినా కొర్రీలు వేసి ముప్ప తిప్పలు పెట్టేవారు. మునిసిపల్ కమిషనర్లను కూడా ఖాతరు చేయకుండా టౌన్ ప్లానింగ్ విభాగం వ్యవహరించేది.
సెల్ఫ్ సర్టిఫికేషన్ సరిపోతుందా…?
భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో స్వీయ ధృవీకరణ సరిపోతుందని గత నెలలో జీవో జారీ చేశారు. ఆ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విషయంలో మరికొన్ని నిబంధనలు విధించారు.తాజాగా రిజిస్టర్డ్ ఇంజినీర్లు,ఆర్కిటెక్ట్ లు యజమానుల సమక్షంలో ఆన్ లైన్ లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుందని ప్రకటించారు. భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన జారీ చేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి నారాయణ చెబుతున్నారు. APDPMS పోర్టల్ లో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. అయితే భవన నిర్మాణాలను కొనసాగించడానికి కార్పొరేషన్ల పరిధిలో మార్టగేజ్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తనఖా పెట్టిన భాగాలను జప్తు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ విడుదల కాదు.ఏపీలో 2019 నాటికి 250కు మించిన స్థలంలో 18మీటర్ల ఎత్తు వరకు భవనాలను నిర్మించుకనే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత నిర్ణత బాండ్లను చెల్లించి ఆరో అంతస్తు నిర్మాణం చేపట్టేందుకు కూడా వైసీపీ ప్రభుత్వంలో అనుమతులిచ్చారు. దీంతో 250-30గజాల్లోపు స్థలాల్లో ఆరంతస్తుల వరకు నిర్మాణాలను చేపట్టే అవకాశం లభించింది.ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవనాల నిర్మాణాల అనుమతులకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుందని …టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే భవన నిర్మాణాలకు పర్మిషన్ వచ్చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.భవన యజమానులు రిజిస్టర్డ్ ఎల్ టీపీలు,ఇంజినీర్లు లేదా ఆర్కిటెక్ట్ ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి స్వీయ ధృవీకరణ(అఫిడవిట్)ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. గత నెలలోనే భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది.భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను త్వరితగతిన జారీ చేసేలా ఈ కొత్త విధానాన్ని సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి నారాయణ చెబుతున్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను APDPMS పోర్టల్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ విధానం ఆమోదం పొందిన లేఅవుట్లు, గ్రామ కంఠం,సర్కులేషన్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు,1985 కు ముందు నిర్మించిన భవనాల పునర్మిణానానికి ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.
టౌన్ ప్లానింగ్‌పై తీవ్ర విమర‌్శలు..
ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం వంటి మునిసిపల్ కార్పొరేషన్లలో భవన నిర్మాణాలకు అనుమతులు, ప్లాన్ మంజూరు అంటే ముడుపులతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఏ ఫీజు ఎంత వసూలు చేస్తారనే వివరాలు ఎవరికి దొరకవు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పినంత చెల్లించాల్సిందే. నిర్ణీత ఫీజులు చెల్లించినా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ప్రసన్నం చేసుకోకపోతే వారిని ముప్ప తిప్పలు పెడతారు. ప్లాన్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే దగ్గర నుంచి దానికి ఫీజులు జనరేట్ అయ్యే వరకు రకరకాల కొర్రీలు వేసి వేధింపులకు గురి చేస్తుంటారు.ఇక ఖాళీ స్థలాలు కట్టే నిర్మాణాలకు ఆ స్థలం కొన్నప్పటి నుంచి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వసూలు చేస్తారు. మధ్యలో ఎందరి చేతులు మారినా అది రికార్డుల్లో ఎక్కినప్పటి నుంచి నిర్మాణదారులు పన్ను చెల్లించాల్సి వస్తోంది. భవన నిర్మాణాలు పూర్తై అవి అమ్ముడుపోయే వరకు ఖాళీగా ఉన్న కాలానికి కూడా ఏపీలో పన్నులు వసూలు చేస్తున్నారు.పాత ఇళ్లను కూల్చి నిర్మాణాలు చేపడితే నిర్మాణం జరిగే సమయానికి కూడా వేలకు వేలు పన్నులు వసూలు చేస్తున్నారు. పాత ఇళ్లకు ఇంటి పన్నులు, డ్రైనేజీ, వాటర్ టాక్స్‌లు చెల్లిస్తూ, కొత్త నిర్మాణాలను చేపడితే ఆ కాలానికి కూడా పన్నులు వసూలు చేస్తున్నారు.అదే సమయంలో కొత్త నిర్మాణాలకు నిబంధనల మేరకు ఫీజులు జనరేట్ చేస్తూ అవే కనెక్షన్లను కొత్తగా ఇస్తున్నట్టు అదనపు వసూళ్లు చేస్తున్నారు. ఒక పాత భవనాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేపడితే పాత భవనానికి, కొత్త నిర్మాణానికి కలిపి రెండు వేర్వేరు పన్నుల్ని ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్లు వసూలు చేస్తున్నాయి. నిర్మాణదారుల సమస్యల్ని పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు.
Read more:Andhra Pradesh:5 ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా ఆశావహులు