Andhra Pradesh:క్లీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్ర

Andhra as a clean energy hub

Andhra Pradesh:క్లీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్ర:ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే గ్రీన్ పాలసీని తీసుకువచ్చారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి.

క్లీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్ర

రాజమండ్రి, ఫిబ్రవరి 18
ఏపీని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే గ్రీన్ పాలసీని తీసుకువచ్చారు. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. మరోవైపు కాకినాడలో ఏఎం గ్రీన్ ఎనర్జీ సంస్థ.. ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ నిర్మాణానికి సంకల్పించింది. కాకినాడలో రూ.12000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాకినాడ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి అయితే ఏడాదికి ఒక మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి అవుతుందని అంచనా.మరోవైపు కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రైవేట్ లిమిటెడ్ .. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద దీనికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇప్పటికే జీవో కూడా జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రాజెక్టుకు అనేక ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఎస్‌జీఎస్‌టీ రెవెన్యూలో వంద శాతం రీయింబర్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రం పరిధిలో జరిపే గ్రీన్ అమ్మోనియా విక్రయాలకు మాత్రమే దీనిని ఐదేళ్ల పాటు అమలు చేయనున్నట్లు తెలిసింది.మరోవైపు క్లీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి ఏపీలో పలు ప్రాజెక్టులు నడుస్తున్నాయి. లక్షా 85 వేల కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ 1,200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు .ఈ హబ్ ద్వారా 57 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే ఈ ప్లాంట్ నుంచి 2028 నాటికల్లా గ్రీన్ హైడ్రోజన్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలనేది అధికారుల ఆలోచన. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి

Read more:Guntur:భయపెడుతున్న జీబీఎస్

Related posts

Leave a Comment