Andhra Pradesh:కిరణ్ రాయల్ కు జనసేన షాక్: తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్ ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు.
కిరణ్ రాయల్ కు జనసేన షాక్
తిరుపతి, ఫిబ్రవరి 10
తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది. కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్ ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనంలేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.గతంలో వైసీపీ నేత రోజా ఫిర్యాదుతో కేసులు పెట్టి తనను అరెస్టు చేసి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని కిరణ్ రాయల్ తెలిపారు. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని చోరీ చేశారని, ఆ డేటాతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి భయపడేది లేదని కిరణ్ రాయల్ అన్నారు.తిరుపతిలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం ఆందోళన చేసింది. కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్ల జీవితాలతో పరాచకాలు ఆడుతున్న కిరణ్ రాయల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అసలేం జరిగిందంటే
తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్‌పై వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ వైరల్ అవుతుంది. తనను బెదిరించి, మోసం చేసి రూ.కోటికి పైగా నగదు, బంగారం కిరణ్ రాయల్ కాజేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటానని మహిళ వీడియో విడుదల చేసింది. అనంతరం ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో విడుదల అయింది. అలాగే ఆ మహిళకు కిరణ్ రాయల్ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దీంతో ఈ రెండు వీడియోలు, ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే తనపై వైసీపీ దుష్ప్రాచారం చేస్తోందని కిరణ్ రాయల్ ఖండించారు.కిరణ్ రాయల్‌ను నమ్మి మోసం పోయానని తిరుపతికి బైరాగపట్టడుగుకు చెందిన ఓ మహిళ వీడియోలో పేర్కొంది. అప్పులు చేసి పలుసార్లు రూ.1.20 కోట్ల వరకు కిరణ్ రాయల్‌కు అప్పు ఇచ్చానని తెలిపింది. అలాగే 25 సవర్ల బంగారం కూడా ఇచ్చానని పేర్కొంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చినదానికి రెండింతలు ఇస్తానని చెప్పాడని పేర్కొంది. తన పిల్లలను చంపుతానని బెదిరించి, కేవలం రూ.30 లక్షలకు చెక్కులు బాండ్లు రాయించారని మహిళ తెలిపింది. తన వద్ద ఉన్న వీడియో రికార్డు తీసుకున్నాడని, అయితే తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అప్పులు ఎక్కువైపోయాయని, పిల్లలకు సమాధానం చెప్పలేకపోతున్నానని, ఇక బతకలేనని తెలిపింది.కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత అయినా ఆ డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. అయితే కిరణ్ రాయల్‌ను తనకు రావల్సిన డబ్బులు అడిగితే, ఆయన తనపై బెదిరింపులకు దిగాడని తెలిపింది. అందుకే వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకుని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.వీడియో బయటకు రాగానే కిరణ్ రాయల్ బాధిత మహిళకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను నానా బూతులు తిడుతూ నిన్ను ఏం చేస్తానో అని బెదిరించారని ఓ ఆడియో వైరల్ అవుతోంది. మర్డర్ చేసి జైలుకు పోయి 40 రోజుల్లో బెయిల్ తీసుకుని బయటకు వస్తానని బెదిరించారని మహిళ ఆరోపించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను మహిళ విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ వివాదంపై స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్ తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. క్రిమినల్ లేడీతో నిరాధార ఆరోపణలు చేయించారని, తనకు ఆ మహిళ రూ.1.20 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలులేవని అన్నారు. వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం ఇదని, భూమన అభినయరెడ్డి ఇలా చేయిస్తున్నారని విమర్శించారుఇది ఇలా ఉండగా తాజాగా బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటపడింది. దీంతో ఈ అంశంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. మహిళా సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ బాధిత మహిళలకు న్యాయం చేయాలని, పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read more:Andhra Pradesh: ప్రతి ఒక్కరికి డిజీ లాకర్