Andhra Pradesh:కలిసి పని చేశారు.. ఊహించనంత మెజార్టీలు సాధించారు

TDP will face the alliance

Andhra Pradesh:కలిసి పని చేశారు.. ఊహించనంత మెజార్టీలు సాధించారు:ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి ఎదురనేది కనిపించడం లేదు. రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఊహించనంత మెజార్టీ సాధించారు. ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు.

కలిసి పని చేశారు..
ఊహించనంత మెజార్టీలు సాధించారు

విజయవాడ, మార్చి 6
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమికి ఎదురనేది కనిపించడం లేదు. రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఊహించనంత మెజార్టీ సాధించారు. ఎవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై రాజశేఖరం పేరాబత్తుల గెలుపొందారు. మొత్తంగా 77,461 ఓట్ల మెజారిటీ తో ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆయన విజయం సాధించారు. ఏడు రౌండ్‌లు పూర్తయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. తన ప్రత్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో కూటమి అభ్యర్థి 71,063 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఏడు రౌండ్లు పూర్తయ్యే సరికి 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వాటిలో చెల్లిన ఓట్లు 1,78,422 ఉన్నాయి. చెల్లనివి 17,578 ఓట్లున్నాయి. దాదాపు 22,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ విజయానికి కావాల్సిన 51 శాతం లభించడంతో విజేతగా ప్రకటించారు. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ప్రత్యర్ధి లక్ష్మణరావుపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544… చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు. వైసీపీ బరిలో నిలబడలేదు కానీ టీడీపీ అభ్యర్థుల్ని ఓడించడానికి ఇతరులకు మద్దతిచ్చింది. బహిరంగంగా పిలుపునివ్వకపోయినా ఆ పార్టీ క్యాడర్ లక్ష్మణరావు, వీర రాఘవుల కోసం పని చేశారని రాజకీయవర్గాలు చెబుతున్నారు. కూటమి తిరుగులేని విజయం సాధించడం వెనుక.. కలసి ఉంటే కలదు విజయం అన్న కాన్సెప్ట్ ఉందని అంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి చీలిపోయింది. రఘువర్మకు టీడీపీ, జనసేన సపోర్టు చేశాయి. కానీ బీజేపీ మాత్రం గాదె శ్రీనివాసులనాయుడుకు సపోర్టు చేసింది. ఇక్కడ బీజేపీ మద్దతుతో పీఆర్టీయూ అభ్యర్థి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తిరుగులేని విజయాన్ని సాధించాయి. ఏ నియోజకవర్గంలో అయినా మినిమం యాభై వేలు అన్నట్లుగా మెజార్టీలు సాధించారు. ఇప్పుడు హోరాహరీగా సాగుతాయని అనుకున్న ఎన్నికల్లోనూ.. ఏకపక్ష విజయాలు లభించడంతో ఇక కూటమి పార్టీలు అలాగే ఉంటే.. ఇతర పార్టీలకు స్పేస్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం మంచిదయిందని లేకపోతే.. అత్యల్పంగా వచ్చే ఓట్లతో మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్గొనేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more:Andhra Pradesh:అధికారుల మధ్య సమన్వయ లోపం.. ముందుకు సాగని పనులు

Related posts

Leave a Comment