Andhra Pradesh:కనిపించని ఆర్కే:మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా వ్యవసాయానికే పరిమితం అయినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సైలెంట్ అయినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలోనూ ఆయన కార్యకర్తలను కలవడం లేదు.
కనిపించని ఆర్కే
గుంటూరు, మార్చి 15
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా వ్యవసాయానికే పరిమితం అయినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సైలెంట్ అయినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలోనూ ఆయన కార్యకర్తలను కలవడం లేదు. చంద్రబాబు నాయుడుపై న్యాయస్థానాలకు వెళ్లడంతో పాటు అనేక కేసులు వేయడంతో తనకు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మౌనాన్నే ఆశ్రయించినట్లు కనపడుతుంది. వైసీపీ అధినేత జగన ను వచ్చి కలిసిన సందర్భం కూడా లేకపోవడం విశేషం.ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో వైఎస్ జగన్ కు ఆయన చోటు కల్పించలేదు. ఎన్నికల ప్రచారంలో నాడు మంత్రి పదవి ఇస్తామనని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వదిలేశారు. మంత్రి పదవిదక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు.
గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి మంగళగిరి టిక్కెట్ ను చిరంజీవికి ఇచ్చారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ ను కూడా నాడు కలిసేందుకు ఇష్టపడలేదు.ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులు కావడంతో ఆమె వెంట నడవాలని భావించి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కానీ తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీ లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగన్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తరుపునే కాకుండా, పార్టీ విషయాలపై బలమైన గొంతుకగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేశ్ విజయం సాధించడంతో పాటు వరసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతుండటంతో ఆయన కొంత డైలమాలో పడినట్లు సమాచారం.వైసీపీలో మరొక చర్చ జరుగుతుంది. ఆయనకు మంగళగిరి సీటు కాకుండా ఈసారి సత్తెనపల్లి సీటును ఇచ్చేందుకు జగన్ సిద్ధమయినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిని వదిలి పెట్టి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలిసింది. తాను ఓటమి చెందిన మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ రకమైన హామీ జగన్ నుంచి లభిస్తే తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట. అయితే జగన్ దీనిపై ఇంత వరకూ క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారని చెబుతున్నారు.
Read also:మరో సిక్స్ లైన్ హైవే
విశాఖపట్టణం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నేషనల్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేల పనువు వేగంగా సాగుతున్నాయి. కొన్ని హైవేల పనులు ముగింపు దశకు చేరాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కీలమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ హైవే విశాఖ – రాయపూర్ మధ్య ఆరు వరుసలగా ఎకనామిక్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ హైవే 130 సీడీగా నిర్మాణం అవుతోంది. రూ.20 వేల కోట్లతో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో.. ఎలాంటి అడ్డంకులు లేకుండా దూరాభారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ హైవే నిర్మాణ పనులు చేపట్టింది. త్వరలోనే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి.ఈ నేషనల్ హైవే ఛత్తీస్‌గఢ్ రాయపూర్‌లోని అభన్పూర్ దగ్గర గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మొదలవుతుంది.. అక్కడి నుంచి ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం మీదుగా అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర ముగియనుంది.
మూడు జిల్లాల పరిధి (విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి)లో రూ.3,215.81 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ఈ క్రమంలో మూడు జిల్లాల్లో ఇంటర్ ఛేంజింగ్ ఫ్లైఓవర్లు నిర్మించారు. వీటితో గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి వాహనాలు మిగతా రోడ్లలోకి, హైవే పైకి వెళ్లడానికి వీలుగా ఉంటుందంటున్నారు. రాయపూర్-విశాఖ మధ్య దూరం 590 కి.మీ ఉంటే.. గ్రీన్‌ఫీల్డ్ హైవేతో 464.662 కి.మీకు తగ్గుతాయంటున్నారు.ఈ హైవేతో ప్రయాణ సమయం 14 గంటల నుంచి 9 గంటలకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనాలకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా ఆ చుట్టుపక్కల భూముల్లో ధరల పెరిగాయంటున్నారు. ఈ హైవేతో విశాఖపట్నంలో రెండు పోర్టులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్గో కార్యకలాపాలకు వీలవుతుంది అంటున్నారు. రెండు పొరుగు రాష్ట్రాలతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి దోహద పడుతుందని చెబుతున్నారు. ఈ హైవే పనులు త్వరలోనే పూర్తవుతాయని.. త్వరలోనే రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.