Andhra Pradesh:కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు:ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ ప్రకటన కూడా చేశారు.
కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు
నెల్లూరు. మార్చి 13
ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ ప్రకటన కూడా చేశారు. కేవలం రూ.10 మాత్రమే పెరిగినట్టు చెప్పారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో మాత్రం బాటిల్ పరిమాణం బట్టి అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ కమిషనర్ ధర పెరుగుదల కేవలం రూ.10 మాత్రమేనని వివరణ కూడా ఇచ్చారు. బ్రాండ్ లేదా పరిమాణంతో సంబంధం లేదని చెప్పారు. మద్యం క్వార్టర్/హాఫ్/ఫుల్ బాటిల్ అనేదానితో సంబంధం లేకుండా, అన్ని బాటిళ్లపై రూ.10 మాత్రమే పెరిగిందని చెప్పారు.మద్యం ధర రూ. 15, రూ 20 పెరిగిందనేది అవాస్తవమని, అపోహలకు గురి కావొద్దని అప్పట్లో విజ్ఞప్తి చేశారు. మద్యం ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.కమిషనర్ ప్రకటనకు ప్రస్తుతం వసూలు చేస్తున్న మద్యం ధరలకు పొంతన లేదని క్లారిటీ వచ్చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు మొదలయ్యాయి. అదే సమయంలో రెండు పాపులర్ బ్రాండ్ల మద్యం ధరల్ని రూ.40 వరకు తగ్గించారు.
ప్రముఖ సినీ నటుడు బ్రాండింగ్ చేస్తున్న బ్రాందీతో పాటు మరో రెండు రకాల విస్కీ ధరల్ని గణనీయంగా తగ్గించారు. రూ.220 క్వార్టర్ బ్రాందీ ధరను రూ. 180కు తగ్గించారు. మరో ప్రముఖ బ్రాండ్ విస్కీ ధరను కూడా తగ్గించారు. గత ఐదేళ్లలో పాపులర్ బ్రాండ్ల మద్యం కొరత ఏపీలో తీవ్రంగా ఉండేది. ఈ క్రమంలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ఏపీలో మద్యం ధరల్ని తగ్గిస్తామని, నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని, ధరల్ని అదుపు చేస్తామని విస్తృత ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు పాపులర్ బ్రాండ్ల ధరలు మాత్రమే కాస్త తగ్గాయి. 2019 మే నాటికి ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం మద్యం ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. దాదాపు రూ.30వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి మద్యం ద్వారా లభిస్తోంది. ఈ క్రమంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతామనే ఉద్దేశంతో ధరలు తగ్గించడానికి ప్రభుత్వం సాహసించలేదు.గత ఐదేళ్లలో మద్యం వ్యాపారం నేరుగా ప్రభుత్వమే నిర్వహించింది. దీంతో కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించడంతో వారికి కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఇస్తానన్న కమిషన్‌కు చెల్లిస్తున్న దానికి పొంతన లేక పోవడంతో వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా మద్యం ధరల్ని పెంచారు.క్వార్టర్ బాటిల్ ధర రూ.10 పెంచినట్టు చెప్పినా, ప్రస్తుతం ప్రతి క్వార్టర్‌కు అదనంగా రూ.10వసూలు చేస్తున్నారు. హాఫ్ బాటిల్‌కు రూ.20, ఫుల్ బాటిల్ ధరపై రూ.40 చొప్పున కొత్త ధరల్ని ముద్రించి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీరు, రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంచలేదు2023-24లో దాదాపు రూ.36వేల కోట్ల రుపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది. ఇందులో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతో పాటు ఉద్యోగుల జీతాలకు పోగా రూ.28-30వేల కోట్ల రుపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయంపై స్పష్టత రావాల్సి ఉంది.మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేశారు. ఈక్రమంలో లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత డిసెంబర్‌లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చారువ్యాపారులకు 14శాతానికి మార్టిన్ పెంచడం వల్ల రూ.వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వం కోల్పోతుందని దీని స్థానంలో ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాద నలు సిద్ధం చేసింది. గరిష్ట చిల్లర ధర రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 ధర పెంచాలని ప్రతి పాదన రెడీ చేసింది. మద్యం బ్రాండ్లలో అన్ని కేటగిరీలకు 14శాతం మార్జిన్ ఇచ్చి , రూ.150 ఖరీదు దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచితే ప్రభుత్వానికి రూ.135 కోట్లు మాత్రమే నష్టం అని లెక్కలు వేసింది. అయితే ప్రస్తుతం ప్రతి క్వార్టర్‌కు రూ.10 చొప్పున ధర పెంచి విక్రయిస్తున్నారు.క్వార్టర్ రూ.99 బ్రాండ్లు మినహా అన్నిటి పై రూ.10 పెంచి, 14శాతం మార్జిన్ ఇస్తే ప్రభుత్వానికి రూ.320 కోట్లు అదనంగా లభిస్తుంది. రూ.150 దాటిన బ్రాండ్లపై రూ.10 పెంచి మార్జిన్ను రెండు కేటగి రీల్లో 10.5, 14 శాతాలుగా అమలుచేస్తే రూ.220 కోట్ల ఆదాయం పెరుగుతుందని లెక్కలు వేస్తున్నారు. తాజా ధరలతో దుకాణాలకు చెల్లించాల్సిన కమిషన్ వెయ్యి కోట్లను మద్యం తాగే వారి నుంచి వసూలు చేస్తున్నట్టు స్పష్టమైంది.
Read more:Andhra Pradesh:తిరుమలలో నెయ్యి కష్టాలు