Andhra Pradesh:ఒక్క రోజే ప్లీనరీ:జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి రాజకీయ పార్టీలు.
ఒక్క రోజే ప్లీనరీ
కాకినాడ ఫిబ్రవరి 22
జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ప్లీనరీ అంటే ఆ పార్టీ కార్యకర్తలకు అభిమాన శ్రేణులకి పండగనే చెప్పాలి. సాధారణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీలు ఏర్పాటు చేస్తుంటారు పార్టీల అధినేతలు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయడానికి ప్లీనరీలను ఏర్పాటు చేస్తాయి రాజకీయ పార్టీలు. పవన్ కల్యాణ్ లాంటి విపరీతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు తన పార్టీకి ప్లీనరీ ఏర్పాటు చేస్తే ఆయన అభిమానులకు కార్యకర్తలకు ఎంతటి ఉత్సాహం ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు జనసేన నేతలు, ఆయన అభిమానులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. పార్టీ స్థాపించిన పదేళ్లకు అధికారంలోకి వచ్చాం ప్లీనరీ ధూంధాంగా చేస్తారని రెండు రాష్ట్రాల్లోని జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో అదిగో అంటూ చాలా కాలం నుంచి వారిని ఊరిస్తూ వచ్చిన పార్టీ చివరకు విషయాన్ని చాలా కూల్‌గా చెప్పేసింది. ఈసారి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారని పేర్కొంది. అయితే అందులో కూడా భారీ ట్విస్ట్ ఇచ్చింది జనసేన అధినాయకత్వం. కొద్ది కాలంగా ప్రచరాంలో ఉన్నట్టు మూడు రోజులు కాకుండా కేవలం ఒక్కరోజుకే ప్లీనరీని పరిమితం చేసింది. నిన్న మొన్నటి వరకు పిఠాపురంలో ఈ ప్లీనరీ మూడు రోజులు పాటు జరుగుతుంది జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై జనసేన హైకమాండ్ నీళ్లు చల్లి ఒక్క రోజుకే పరిమితం కావడంతో జన సైనికుల్లో నిరాశ కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్టీ ప్లీనరీ అందులోనూ అధినాయకుడు పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో గెలిచిన పిఠాపురంలో తొలి ప్లీనరీ. జన సైనికులు ఆనందంతో ఉప్పొంగిపోవడానికి ఈ ప్రకటన చాలు. మొదట్లో దానికి అనుగుణంగానే మూడు రోజులపాటు అంటే మార్చి 12 నుంచి 14 వరకు ప్లీనరీ జరుగుతుందని భావించారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ ప్రతినిధులతో సమావేశం, శ్రేణులకు దిశా నిర్దేశం జరిగిపోయింది. జన సైనికులను ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభ అందులో పవన్ ప్రసంగం ఇలా పక్కా ప్లాన్‌తో మూడు రోజుల పాటు ప్లీనరీ సంబరం జరుగుతుందని అంతా భావించారు. ఈవిషయాన్ని జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్ సహా ఇతర కీలక నేతలు జనవరిలోనే ప్రకటించారు. కాని సడన్‌గా ప్లీనరీ ఒక్కరోజే జరుగుతుందని జనసేన నుంచి ప్రకటన వెలువడింది. పార్టీ ఆవిర్భవించిన మార్చి 14 బహిరంగ సభ ఉంటుందని ప్రస్తుతానికి స్పష్టత వచ్చింది. పార్టీ ప్రతినిధుల సమావేశం అదే రోజు ఉదయం పూట జరుగుతుందా లేక అది రద్దు అవుతుందా అని దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు.ఇటీవల పవన్ కల్యాణ్ అస్వస్థతకు లోనైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌కి ఆయన అటెండ్ కాలేదు. అలాగే “జనంలోకి జనసేన” కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన లేదు. ప్రస్తుతానికి ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజిగా ఉంటున్నారు. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం లేదని సమాచారం. ఒకవేళ ఇదే కారణమా లేక మరేదైనా ఆలోచనో తెలియదు. కానీ మూడు రోజులు జరుగుతుందని చెప్పిన ప్లీనరీ ఒక్క రోజుకే పరిమితం కావడం మాత్రం తమ అధినాయకుడు మూడు రోజులు పాటు తమతోనే ఉంటాడు అని భావించిన జన సైనికులకు కాస్త నిరాశ కలిగించే అంశమే.