Andhra Pradesh:ఐదు జిల్లాల అభివృద్ది పరుగులు

construction of Amaravati Outer Ring Road.

Andhra Pradesh:ఐదు జిల్లాల అభివృద్ది పరుగులు:అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 189.9 కిలోమీటర్లకు ఇటీవల ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

ఐదు జిల్లాల అభివృద్ది పరుగులు

ఏలూరు, గుంటూరు, ఫిబ్రవరి 27
అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 189.9 కిలోమీటర్లకు ఇటీవల ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్‌ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్‌ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌కి అనుసంధానం ఉన్నట్లే.. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్‌ మొదలయ్యే కాజా నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కి.మీ మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు.దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

గుంటూరు బైపాస్‌లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్‌ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తరించనున్నారు. దీనికి సంబంధించి మూడు ఎలైన్‌మెంట్లను సిద్ధం చేశారు.ఔటర్ రింగ్ రోడ్డు 5 జిల్లాల పరిధిలో 3 మండలాల్లోని 121 గ్రామాల మీదుగా వెళ్లనుంది. కృష్ణా జిల్లాలో.. బాపులపాడు మండలంలోని బండారుగూడెం, అంపాపురం, గన్నవరం మండలంలోని సగ్గురు ఆమని, బల్లిపర్రు, బుతుమిల్లిపాడు, ఉంగుటూరు మండలంలోని పెద్దఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వెలినూతల, వెల్దిపాడు, తరిగొప్పుల, వేంపాడు, బొకినాల, మానికొండ, కంకిపాడు మండలంలోని మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లె, కుందేరు, తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్‌ వల్లూరు, సౌత్‌ వల్లూరు గుండా ఓఆర్ఆర్‌ వెళ్లనుంది..ఎన్టీఆర్‌ జిల్లాలో.. కంచికచర్ల మండలంలోని కంచికచర్ల, పెరెకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మొగులూరు, కునికినపాడు, వీరులపాడు మండలంలోని పొన్నవరం, జగన్నాథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావుపాలెం, జి.కొండూరు మండలంలోని జి.కొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు, మైలవరం మండలంలోని మైలవరం, పొందుగుల, గణపవరం మీదుగా రింగ్ రోడ్డును నిర్మించనున్నారు.

ఏలూరు జిల్లాలో.. ఆగిరిపల్లి మండలంలోని బొద్దనపల్లె, గరికపాటివారి కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నుగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, కృష్ణవరం, సురవరం, కల్లటూరు మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది..గుంటూరు జిల్లాలో.. మంగళగిరి మండలంలోని కాజా, చినకాకాని, తాడికొండ మండలంలోని పాములపాడు, రావెల, మేడికొండూరు మండలంలోని సిరిపురం, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు, పెదకాకాని మండలంలోని నంబూరు, దేవరాయబొట్లపాలెం, అనుమర్లపూడి, దుగ్గిరాల మండలంలోని చిలువూరు, కంఠంరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠేవరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు మండలంలోని గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల, గుంటూరు తూర్పు మండలంలోని ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు, గుంటూరు పశ్చిమ మండలంలోని పొత్తూరు, అంకిరెడ్డిపాలెం మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది..ఇక పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు మండలంలోని ముస్సాపురం, పాటిబండ్ల, జలాల్‌పురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాశిపాడు గ్రామాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతాయని రియల్టర్లు చెబుతున్నారు.

Read more:Andhra Pradesh:అంతు పట్టని జగన్ స్ట్రాటజీ

Related posts

Leave a Comment