Andhra Pradesh:ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్

Revenge politics in AP

Andhra Pradesh:ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదు. ఇప్పుడు కొత్త తరహా పాలిటిక్స్ ను చూస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, విపక్షాలను కేసులతో ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇక ఇది సంప్రదాయంగా కొనసాగే అవకాశముంది. పార్టీ నాయకత్వాలు ఊరుకున్నా, క్యాడర్ మాత్రం ఊరుకునేట్లు కనిపించడం లేదు.

ఏపీలో రీవెంజ్ పాలిటిక్స్

విజయవాడ, మార్చి4
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు చూడలేదు. ఇప్పుడు కొత్త తరహా పాలిటిక్స్ ను చూస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ, విపక్షాలను కేసులతో ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇక ఇది సంప్రదాయంగా కొనసాగే అవకాశముంది. పార్టీ నాయకత్వాలు ఊరుకున్నా, క్యాడర్ మాత్రం ఊరుకునేట్లు కనిపించడం లేదు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నుంచి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నేతలను అరెస్ట్ చేసి జైల్లోకి పంపారు. ఇక క్యాడర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. అనేక అక్రమ కేసులు 2019 నుంచి 2024 మధ్య కాలంలో నమోదయ్యాయి.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు. చట్ట ప్రకారం అరెస్ట్ లు చేస్తామని చెబుతున్నప్పటికీ రివెంజ్ మాత్రం తప్పదన్న సూచనలు కూటమి ప్రభుత్వం బలంగా వినిపిస్తుంది. వరస అరెస్ట్ లు వైసీపీ నేతలను కలవరపెడుతున్నాయి. అయితే అరెస్ట్ లకు నాడు టీడీపీ కానీ, నేడు వైసీపీ నేతలు కాని భయపడటం లేదు. ఇప్పటికే నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిలు అరెస్టయ్యారు. వరస కేసులు నమోదు అవతుండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనన్న టెన్షన్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు మానసికంగా తమ అరెస్ట్ తప్పదని సిద్ధమయినట్లే కనిపిస్తుంది.

ఇటు టీడీపీ, వైసీపీ క్యాడర్ మాత్రం తగ్గడం లేదు. అరెస్ట్ చేయాల్సిందేనంటూ వత్తిడి తెస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిని వదలొద్దంటూ టీడీపీ సోషల్ మీడియాలో క్యాడర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. పలానా వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలంటూ నేరుగా ప్రశ్నిస్తూ పార్టీ అధినాయకత్వానికే సవాళ్లు విసురుతుంది. అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడమేంటని నిలదీస్తున్నారు. పేర్లు పెట్టి మరీ వారిని అరెస్ట్ చేయాలని, వారు అధికారంలో ఉండగా ఏలా మాట్లాడారో ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై కూడా వత్తిడి పెరుగుతందనే చెప్పాలి.ఇక వైసీపీ క్యాడర్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కానివ్వండి.. అరెస్ట్ చేయండి.. మేం సిద్ధం.. తాము అధికారంలోకి రాగానే మీరు కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు. తాము కూడా బ్లూ బుక్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నామని, అందరి పేర్లను నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి వైసీపీ అధినేత జగన్ కూడా తన దైన శైలిలో స్పందించారు. ఎవరినీ వదిలిపెట్టబోనని జగన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టబోమని, కొట్టారు తీసుకున్నామని, తిరిగి ఇవ్వడంగ్యారంటీ అని ప్రకటిస్తున్నారు. దీంతో ఎవరు అధికారంలోకి వచ్చినా మరొకరు జైలులోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏపీలో నెలకొంది.

Read more:AP News : గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ

Related posts

Leave a Comment