Andhra Pradesh:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు

Fake pension scam in AP

Andhra Pradesh:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు:ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు.

ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు

ఏపీలో ఫేక్‌ పెన్షన్ల గుట్టు వీడుతోంది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు వైకల్యాన్ని బట్టి గరిష్టంగా రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నారనే అభియోగాలపై ఆరోపణలు రావడంతో వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తైన తనిఖీల్లో వేల సంఖ్యలో అక్రమార్కులు బయట పడ్డారు.వైకల్యం లేకున్నా అడ్డదారిలో ధృవీకరణ పత్రాలను సంపాదించి పెన్షన్లు పొందుతున్న వారి గుట్టు రట్టవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తనిఖీలలో వేలాదిమంది అక్రమార్కులు పొందుతున్నట్టు గుర్తించారు. రూ.6వేలు, రూ.15వేల పెన్షన్లు పొందే వారిలో అనర్హులను గుర్తించి వారి పెన్షన్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రాష్ట్రంలో రూ.15వేల పెన్షన్లు పొందుతున్న 25వేల మందిలో 19వేల మందిని ఇప్పటికే సమగ్రంగా తనిఖీ చేశారు. వాటిలో ఉన్న వివరాల ఆధారంగా 3వేల మందికి రూ.15వేల పెన్షన్లకు అనర్హులుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో స్వల్ప వైకల్యం ఉన్న 300మందికి రూ.15వేల పెన్షన్లు చెల్లిస్తున్నారు.

19వేలమందిలో దాదాపు 10వేల మందికి రూ.6వేల పెన్షన్ పొందడానికి మాత్రమే వైకల్యాన్ని గుర్తించారు. గరిష్ట పెన్షన్ పొందుతున్న వారిలో ఇప్పటికే 24వేల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.మరోవైపు రాష్ట్రంలో 7.96లక్షల మంది ప్రస్తుతం రూ.6వేల పెన్షన్ పొందుతున్నారు. వీరిలో2లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తి చేసి లక్షన్నర మంది సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేశారు. వారిలో స్వల్ప వైకల్యం, వైకల్యం లేకున్నా 40వేల మంది పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు.రాష్ట్రంలో గత ఐదేళ్లలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లతో వికలాంగుల పెన్షన్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వృద్ధాప్య పెన్షన్ రూ.4వేల చెల్లిస్తుండగా దివ్యాంగులకు సగటున దివ్యాంగులకు గరిష్టంగా రూ.15వేలు చెల్లిస్తుండటంతో పెద్ద ఎత్తున అనర్హులను పెన్షన్లలో చేర్చారు. పెన్షన్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెల రూ.3వేల కోట్లను ఖర్చు చేస్తోంది.మరోవైపు ఏపీలో ప్రతి నెలల దాదాపు 63లక్షల మందికి రకరకాల పెన్షన్లను చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 90శాతం మందికి తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేశారు. రైస్‌ కార్డుల ప్రతిపాదికన ప్రతి కుటుంబంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లను మంజూరు చేశారు. ఈ క్రమంలో అడ్డదారిలో పెన్షన్లను దక్కించుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. రాజకీయ సిఫార్సులు, సిబ్బంది అవినీతితో అర్హత లేకున్నా పెన్షన్లను ఎడాపెడా ఇచ్చేశారు. అనర్హులను గుర్తించే విషయంలో రాజకీయ విమర్శలకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.

Read also:అందరిని దూరం చేసుకుంటున్నారే.

ఒంగోలు, మార్చి 15
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు దగ్గర వాళ్లంతా దూరమవుతున్నారు. నా అనే వాళ్లు ఎవరూ ఆయన వద్ద ఉండకుండా పోతున్నారు. అయిన వాళ్లే శత్రువులుగా మారుతున్నారు. జగన్ కు అధికార పక్షం కంటే ఇప్పుడు స్వపక్షమే పెద్ద ఇబ్బందిగా మారింది. అసలు ఎందుకీ పరిస్థితి? జగన్ లో లోపమా? లేక పక్కన ఉన్న వాళ్లు పక్కదోవ పట్టిస్తున్నారా? ఐఏఎస్ లు కావచ్చు.. సొంత మనుషులు కావచ్చు. ఎవరైనా చెప్పిన మాటలను విని తనను కష్టకాలంలో ఆదుకున్న వారిని దూరం చేసుకుంటే ఎవరికి నష్టమన్నది జగన్ ఆలోచిస్తున్నారా? లేదా? అని అనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత నుంచే ఈ రకమైన పరిస్థితిని జగన్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై ఆధారపడతారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. వారికి పదవులు ఇచ్చో.. మరొక రూపంలోసాయం అందించో.. తనకు వ్యతిరేకంగా మారకుండా చేసుకుంటారు. చంద్రబాబు నాయుడును చూసైనా నేర్చుకోకపోతే ఎట్లా? ఎన్టీఆర్ ను దించేసి పార్టీని చేతుల్లోకి తీసుకున్నప్పటికీ నందమూరి కుటుంబాన్ని ఆయన దూరం చేసుకోలేదు. ఒక్క దగ్గుబాటి కుటుంబంతో మాత్రమే నిన్నటి వరకూ కొంత పొరపచ్చాలుండేవి. అవి కూడా మొన్నటితో మాసిపోయాయి. ఎన్టీఆర్ వారసులెవరు తన రాజకీయాలలకు అడ్డుపడకుండా వారిని చూసుకోగలిగారు. ఇక తన సొంత కుటుంబంలో కూడా చంద్రబాబు ఎప్పుడూ విభేదాలు పెట్టుకోలేదు.

చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కొంతకాలం విభేదించినా తర్వాత మళ్లీ అన్న పంచన చేరిపోయారు.కానీ జగన్ అధికారంలోకి రాగానే చెల్లి వైఎస్ షర్మిలను దూరం చేసుకున్నారు. తర్వాత తల్లికి దూరమయ్యారు. చివరకు చెల్లి, తల్లిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అధికారం కోల్పోయిన తర్వాత తన దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లారు. జగన్ వైఖరి నచ్చకే ఆయన పార్టీని వదిలి తన ప్రత్యర్థి పంచన చేరారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి కూడా దూరమయ్యారు. విజయసాయిరెడ్డి బంధువు కాకపోయిన దగ్గర బంధువు కింద లెక్కే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆయన కుటుంబానికి ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి తర్వాత క్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంది. విజయసాయిరెడ్డి ఏదైనా పొరపాటు చేసినా పిలిచి మందలించే స్వేచ్ఛ కూడా జగన్ కు ఉంది. కానీ ఆ రెండూ కాదని సాయిరెడ్డి తనంతట తానే దూరమయ్యేలా జగన్ చేసుకున్నారంటే జగన్ కు బంధువుల పొడగిట్టదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జనంలోకి కూడా ఈ ఘటనలు తప్పుడు ప్రచారానికి వెళతాయి. జనం కూడా అదినమ్మి జగన్ కు వ్యతిరేకమయ్యే అవకాశముంది. అదే సమయంలో దగ్గర బంధువులే దూరమయి ఆరోపణలు చేస్తుంటే చూసే వారికి నిజం అనిపించక మానదు. జగన్ ది స్వయంకృతాపరాధమేననిచెప్పాలి. ఇందులో ఎవరి తప్పిదం లేదు

Read more:Andhra Pradesh:విజయసాయిరెడ్డి భవిష్యత్ పక్కా ప్లాన్

Related posts

Leave a Comment