Andhra Pradesh:ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్:ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు.
ఆర్టీఐ చట్టంతో బ్లాక్ మెయిల్
కర్నూలు, ఫిబ్రవరి 1
ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తులను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడిని బెదిరించిన ఈ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. ఆదోని మండలం బసాపురం వాసులు రఘునాథ్, ఆడివేష్ ఆర్టీఐ పిటిషన్లు వేస్తూ దందాలు సాగిస్తున్నారు. వివిధ ఆసుపత్రులపై పిటిషన్లు వేయడం లోపాలు గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారు. అదే మాదిరిగా ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి దమ్కీ ఇచ్చారు. రూ.50లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై ఆ యాజమాన్యం పోలీసులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు వెళ్లే సరికి వారిపై కూడా నిందితులు తిరగబడ్డారు. వెంటనే వారిని అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. ఓ మెకానిక్ ఇచ్చిన సమాచారంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కోటి రూపాయలకుపైగా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నోట్ల తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా పోలీసులు సీజ్ చేశారు. గుంటూరు కేంద్రంగా ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రిస్తూ వస్తోంది. పదిహేను రోజుల క్రితం హరిబాబు అనే వ్యక్తి తన వ్యాన్‌ను రిపేర్ చేయాలని రాంబాబును కలిశాడు. రాంబాబు తన స్నేహితుడు ఆకుల పవన్‌తో కలిసి వ్యాన్‌ను చెక్ చేశారు. రిపేర్‌కు పదివేలు అవుతుందని చెప్పారు.
వెంటనే జేబులో ఉన్న రెండు వేల రూపాయలను హరిబాబు వాళ్లకు ఇచ్చేశాడు. మిగిలిన డబ్బులు రిపేర్ పూర్తి అయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. వ్యాన్ రిపేర్‌కు కావాల్సిన స్పేర్ పార్ట్లు కొనేందుకు షాప్ వద్దకు వెళ్లాడు రాంబాబు. పార్ట్స్ తీసుకొని డబ్బులు ఇచ్చాడు. అవి ఫేక్ నోట్స్ అని షాపువాళ్లు చెప్పడంతో షాక్ తిన్నాడు. వెంటనే బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అనపర్తి, బిక్కవోలు, రంగంపేట పోలీసులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇలా పలు ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ చెలామణి చేస్తున్న నలుగురిని పోలీసులు వారం రోజు క్రితం అరెస్టు చేశారు. వారి నుంచి 756 నకిలీ 500 రూపాయలు అంటే మూడు లక్షల 78 వేలు రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్లని రిమాండ్‌కు తరలించారు. వేగం పెంచిన పోలీసులు శుక్రవారం సాయంత్రం అసలు సూత్రధారి అయిన కర్రీ మణికుమార్‌ను గుంటూరులో అరెస్టు చేశారు. అతని వద్ద 39,700 నకిలీ 500, 200, 100 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,02,80,000రూపాయలు. వీటితోపాటు కంప్యూటర్, CPU, లామినేటర్, పెన్ డ్రైవ్‌లు, స్కానర్లు, SBI పేపర్ షీట్లు జప్తు చేశారు. వివిధ వ్యాపారాలు చేసిన నష్టపోయిన వీళ్లంతా టీంగా ఏర్పడి ఈ నకిలీ నోట్లు చెలామణికి యత్నించినట్టు పోలీసు విచారణలో తేలింది. ఇంకా ఈ ముఠాలు ఎవరెవరు ఉన్నారు ఇంకా మూలాలు ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read more:Andhra Pradesh:షర్మిళ వర్సెస్ సునీత