Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు

MLC aspirants in AP Assembly lobbies

Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు:ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు.

ఒక్కసారి.. ఒకే ఒక్కసారి..

ఆశావహుల వేడ్కోలు

గుంటూరు, మార్చి 4
ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు స్వీకరిస్తున్నారు.ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. టీడీపీకి చెందిన ఆశావహులంతా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 5 కూడా కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇందులో ఒకటి జనసేన తరపున నాగబాబుకు గ్యారెంటీ అనే సిగ్నల్స్ ఇచ్చారు. మిగిలిన నాలుగింటిలో టీడీపీకే దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొన్నటి వరకు బీజేపీకి అనుకున్నప్పటికీ.. ఆ పార్టీకి ఈసారికి అవకావం లేదని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఆ నలుగురు ఎవరు అనే చర్చ నడుస్తోంది.ఆశావహులు అంతా అసెంబ్లీ ప్రాంగణంలోని చంద్రబాబు, లోకేశ్ ఛాంబర్ల చుట్లూ తిరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోల్పోయిన వారికే ప్రథమ ప్రాధాన్యం అని టీడీపీ హైకమాండ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, కొమ్మాలపాటి శ్రీధర్, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, పీతల సుజాత..ఇలా పలువురి సీనియర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం సీనియర్ నేతలు రిటైర్ అవుతున్నారు. యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు ఉన్నారు. వీరికి రెన్యువల్ ఉంటుందా అనేదానిపై ఇప్పటివరకు క్లారిటీ రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 10వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు 5, 6 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నారు.బీజేపీ హైకమాండ్ ఏదైనా ఒక స్థానం కోరుతుందా? అనేదానిపై ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎవరెవరికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలి అనేదానిపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారు. దీనిపై 9వ తేదీన చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read more:Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే

Related posts

Leave a Comment