Andhra leaders on the way to Bihar | బీహార్ దారిలో ఆంధ్రా నేతలు ..? | Eeroju news

Andhra leaders on the way to Bihar

బీహార్ దారిలో ఆంధ్రా నేతలు ..?

విజయవాడ, జూలై 1, (న్యూస్ పల్స్)

Andhra leaders on the way to Bihar

ప్రత్యేకహోదా అంశానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయం ఉంది. 2014లో ఎన్డీఏ కూటమికి.. తర్వాత 2019లో జగన్ విజయానికి సహకరించింది. 2024కి వచ్చే సరికి ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల అస్త్రం కాలేదు. జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు సొంత పార్టీ పెట్టుకుని ప్రత్యేక హోదా నినాదం వినిపించినా ఆ బలం సరిపోలేదు. కాంగ్రెస్ పార్టీ తాము వస్తే మొదటి సంతకం హోదాపై పెడతామన్నా ప్రజలు లైట్ తీసుకున్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకహోదా తెరపైకి కు వచ్చింది.  కేంద్రంలో  టీడీపీ కీలక పాత్ప పోషిస్తోంది. టీడీపీతో పాటు కింగ్ మేకర్‌గా బీహార్‌కు చెందిన జేడీయూ కూడా కీలకంగా ఉంది.

ఆ పార్టీ బీహార్‌కు స్పెషల్ స్టేటస్ అడుగుతోంది. కానీ ఏపీలో టీడీపీ సైలెంట్‌గా ఉంటోంది. ఇప్పుడు ఇదే జగన్‌కు అస్త్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే జగన్ అందుకుంటారా లేదా అన్నదే కీలకం.. బీహార్ సీఎం నితీష్ కుమార్  బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనకు జేడీయూ పార్టీ ఆమోదం తెలిపింది.   నితీష్ కుమార్, ఆయన పార్టీ తమ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా రాజకీయ తుఫాను రేపారు. జేడీయూ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా.. టీడీపీకి ఇబ్బంది కరమే. నిజానికి టీడీపీ ప్రత్యేకహోదా గురించి చెప్పలేదు.

హోదా ఇవ్వలేదని కేంద్రం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏకి వ్యతిరేకంగా పోటీ చేస్తే ప్రజలు ఆదరించలేదు. ఇటీవలి ఎన్నికల్లో హోదా ఇస్తామని కానీ..తెస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే నితీష్ కుమార్  కేంద్రంలో తమ పార్టీ మద్దతు అవసరం కాబట్టి ఆయన తరచూ హోదా ప్రస్తావన తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకంగా మారినప్పుడు హోదాతోపాటు  అమరావతి నిర్మాణానికి నిధులు వంటి కీలక విషయాలను షరతులుగా పెట్టి ఉంటారని అనుకున్నారు. అయితే బేషరతుగా మద్దతిస్తున్నామని రాష్ట్రానికి ఏం కావాలో అది తెచ్చుకుంటామని టీడీపీ చెబుతోంది. అయితే జగన్ మాత్రం.. ప్రత్యేకహోదా అడగకపోవడం పెద్ద పాపమని..తమ పార్టీ అంతర్గత సమావేశంలో వ్యాక్యానించారు.  2019 ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని అన్నారు.

తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి మన అవసరం లేదని, వారే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్న కారణంగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకున్నానని తన నిస్సహాయతను బహిరంగంగానే చెప్పారు. కానీ రాజ్యసభలో వైసీపీ సపోర్ట్ బీజేపీ చాలా ఇబ్బంది పడేది. అయితే ప్రతీ సారి  బీజేపీకి మద్దతు ఇచ్చారు కానీ హోదాను డిమాండ్ చేయలేదు.  ప్రత్యేక హోదా అంశం ఉపయోగించుకుంటే  వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ చేతిలో వజ్రాయుధంలా మారే అవకాశం ఉంది.  ప్రత్యేక హోదా అంశానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందా లేదా అన్నది చెప్పడం కష్టం.

ఎందుకంటే గతంలో ఈ హోదా పేరుతో అన్ని పార్టీలు ఓట్లు పొందాయి. ఎవరూ ఇవ్వలేదు .. తీసుకురాలేదు.  హోదా విషయంలో ప్రజలు ఆసక్తి కోల్పోయారు. అందకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నా.. జేడీ లక్ష్మినారాయణ పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న జగన్.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమైని ఉద్యమం చేస్తే కాాస్త కామెడీ అవుతుంది. అయినా సరే ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ కు ప్రత్యేక ఆయుధం దొరికినట్లే అవుతుంది. జగన్ వెనుక ఉన్న కేుల లగేజీ కావొచ్చు.. మరో అంశం కావొచ్చు ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్లడానికి జగన్ సిద్దంగా లేరు. స్పీకర్ ఎన్నికలోనూ ఆయన ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు. తర్వాత ఏదైనా అవసరం వచ్చినా ఆయన మద్దతిస్తారు. అలాంటిది ఇప్పుడు హోదా విషయంలో ఎన్డీఏను విలన్ ను చూసి ప్రజల్లోకి వెళ్తారా అన్నది పెద్ద ప్రశ్న.

ఆయన బీజేపీని ఇరుకున పెట్టే పనులు ఇప్పడల్లా చేయలేరని..చేస్తే ఆయన రిస్క్ తీసుకున్నట్లేనని అంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా అందివచ్చిన అవకాశాన్ని వదులుకోక తప్పదని అంచనాకు వస్తున్నారు. మరి జగన్ ఈ అంచనాల్ని తలకిందులు చేస్తారా ? హోదా కోసం ఎన్డీఏపై యుద్ధం ప్రకటిస్తారా ?అయితే బీహార్ సీఎం తన రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించుకోవడానికే ఇలా రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. బీహార్ తో పాటు ఏపీకి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని అంటున్నారు.  అయితే ఇది ఏ రూపంలో చేస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. మరోసారి బీజేపీకి ప్రత్యేకహోదా మరకలు అంటించే ప్రయత్నం చేస్తే ఆ  పార్టీ అగ్రనేతలు సహించే అవకాశం ఉండదన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.

Andhra leaders on the way to Bihar

మోడీలో మార్పు మంచిదేనా… | Is change in Modi good? | Eeroju news

 

Related posts

Leave a Comment