శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా
నెల్లూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
బ్రహ్మ ఆనందం సినిమా రిలీజ్ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా పలు కామెంట్స్ చేశారు. తన ఇంటిలో తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ అనే ఫీలింగ్ వస్తుందని మెగాస్టార్ అన్నారు. తమ వారసత్వాన్ని కొనసాగించేందుకు వారసుడిని ఇవ్వాలని, రామ్ చరణ్ కు చెప్పినట్లు తన మదిలో మాట సరదాగా మెగాస్టార్ చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త వివాదంగా మారాయి. మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. కుమారులే వారాసులవుతారా? కుమార్తెలు వారసులు కారా అంటూ శ్యామల ప్రశ్నించారు. అంతటితో ఆగక, కోడలు ఉపాసన అన్ని రంగాలలో రాణిస్తూ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేదా అంటూ శ్యామల ప్రశ్నించారు. శ్యామల కామెంట్స్ ని బట్టి కుమార్తెలు కూడా వారసులవుతారని ఆమె అభిప్రాయం. ఈ కామెంట్స్ సెగ నేరుగా మాజీ సీఎం జగన్ కు తగిలాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది.వైఎస్ జగన్ ఆమె సోదరి వైఎస్ షర్మిళ మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయం అందరికీ తెల్సిందే. ఇటీవల ఆస్తి తగాదాలు వెలుగులోకి రాగా, పరస్పర విమర్శల జోరు సాగింది. షర్మిళ తన మాటలతో జగన్ పై అస్త్రాలు సంధించగా, జగన్ కూడా అదే రీతిలో స్పందించారు. కన్నతల్లిపై కేసు పెట్టారని, ఇదేనా తల్లికి ఇచ్చే గౌరవం అంటూ షర్మిళ ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టించిన ఘనత కూడా అన్నదే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వీరి ఆస్తుల వివాదం బాగా ముదిరి, చివరకు న్యాయస్థానాలకు చేరింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది.
జగన్ జైలుకు వెళ్లిన సమయంలో షర్మిళ.. వైసీపీ బలోపేతానికి చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఓదార్పుయాత్ర కొనసాగించి పార్టీకి బూస్ట్ ఇచ్చారని క్యాడర్ చెబుతుంటారు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే, షర్మిళ ను జగన్ పక్కన పెట్టేశారని పలుమార్లు షర్మిళ భర్త అనిల్ ఆరోపించారు. తమకు ఆస్తుల తగాదాల వల్లే విభేధాలు వచ్చాయని అనిల్ తెగేసి చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ వారసురాలిగా తనకు హక్కు ఉందన్న వాదనను షర్మిళ వక్కాణించి పలికారు. జగన్ కు ఉన్న హక్కు తనకు ఉందంటూ, వైఎస్సార్ సూచించినట్లుగా ఆస్తుల పంపకాలు జరగాలన్నది ఆమె వాదనవీరి ఆస్తి వివాదం వల్ల వైఎస్సార్ అభిమానులు కూడా రెండు గ్రూపులుగా తయారయ్యారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై గురిపెట్టిన శ్యామల, స్పందిస్తూ చేసిన కామెంట్స్ నేరుగా జగన్ కు తగిలాయని టీడీపీ విమర్శిస్తోంది. అలాగే జనసేన కూడా.. షర్మిళ గతంలో ఆస్తి పంపకాలపై చేసిన కామెంట్స్ ని పోస్ట్ చేస్తూ.. శ్యామల గారూ.. ఇదే మాట మీ అధినేతకు చెప్పండని కోరుతున్నారు. తండ్రికి కుమార్తెలు వారసులుగానే పరిగణించ బడతారని, షర్మిళకు రావాల్సిన ఆస్తిని అలాగే అప్పజెప్పేలా చూడాలని శ్యామలను కూటమి నేతలు కోరుతున్నారు. శ్యామల తన కామెంట్స్ తో మెగాస్టార్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తే, ఆ కామెంట్స్ ను మాజీ సీఎం జగన్ కు ఆపాదించి జనసేన, టీడీపీ పోటాపోటీగా ట్రోలింగ్ చేస్తున్నాయి. వైఎస్ షర్మిళకు శ్యామల మద్దతునివ్వడం హర్షించదగ్గ విషయమని సోషల్ మీడియా అంటోంది. మరి ఈ కామెంట్స్ కి శ్యామల రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.
==============
Ys Sharmila Vs Ys Jagan | చంద్రబాబు అసెంబ్లీకి రానప్పుడు ఎక్కడున్నావ్ షర్మిల ? | FBTV NEWS