తనకు మీడియా సపోర్ట్ లేదంటూనే.. గత ఐదేళ్లుగా పాలన చేశారు జగన్. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా రకాల ప్రయోజనాలు పొందింది ప్రధాన మీడియా. ఏపీ ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని భావిస్తోంది.
జగన్ ఎఫెక్ట్.. మై హోమ్ లీజులు రద్దు
అనంతపురం, జనవరి 8
తనకు మీడియా సపోర్ట్ లేదంటూనే.. గత ఐదేళ్లుగా పాలన చేశారు జగన్. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం నుంచి చాలా రకాల ప్రయోజనాలు పొందింది ప్రధాన మీడియా. ఏపీ ప్రభుత్వం దూకుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఏపీవ్యాప్తంగా ఉన్న లైమ్ స్టోన్ లీజుల విషయంలో పున సమీక్షిస్తోంది. అందులో భాగంగా మై హోమ్ గ్రూపునకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని భావిస్తోంది. వైసిపి ప్రభుత్వం అనంతపురం తో పాటు చాలాచోట్ల లైమ్ స్టోన్ లీజులను 50 ఏళ్ల వరకు మై హోమ్ గ్రూపునకు కేటాయించింది. వీటిని రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది సంచలన అంశంగా మారింది.మై హోమ్ గ్రూపునకు చెందినదే టీవీ 9. గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించింది ఈ మీడియా. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, ఆయన కుమారుడు టీవీ9 మీడియాను వైసీపీకి అప్పగించినట్లు విమర్శ ఉంది. దాని ప్రతిఫలంగా రాష్ట్రవ్యాప్తంగా అడ్డగోలు లీజులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా టీవీ9 తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వార్చింది. ఒకానొక దశలో వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడింది. కానీ యాజమాన్యం ఎటువంటి చర్యలకు దిగలేదు. అయితే నాడు వైసిపికి టీవీ9 మీడియాను అప్పగించడమే అందుకు కారణం.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మై హోమ్ గ్రూపునకు కేటాయించిన లీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వెంటనే గ్రూప్ చైర్మన్ రామేశ్వరం తో పాటు ఆయన కుమారుడు చంద్రబాబును కలిశారు. లీజులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేనట్లు సమాచారం. గతం మాదిరిగా చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. ఈ విషయంలో పార్టీ యువనాయకత్వం ఆలోచన మరోలా ఉంది. ఇటువంటి వారి విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లాలని యువ నాయకత్వం భావిస్తోంది. అందుకే గనుల లీజు విషయంలో మై హోమ్ గ్రూపునకు డోర్ క్లోజ్ అయినట్లు సమాచారం. మరి టీవీ9 ద్వారా ఏపీ ప్రభుత్వంపై అదే దూకుడుతో ముందుకు వెళ్తారా? వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి.
Read:Srikakulam:తమ్మినేని దారెటు