Amla Health Benefits | పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా..? | ASVI Health

Amla Health Benefits

పోషకాల పవర్‌హౌస్‌తో ఇక తిరుగుండదు.. డైలీ ఒకే ఒక్క ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలుసా..?

Amla Health Benefits

పోషకాల గని ఉసిరి.. దీనిలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి. ఆమ్లాను విటమిన్ సి పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఉసిరిని అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా పేర్కొంటారు. అనేక వ్యాధులను నయం చేయడానికి ఇప్పటికీ ఆయుర్వేదంలో ఉసిరిని వినియోగిస్తారు. ఉసిరి రుచి పుల్లగా వగరుగా ఉన్నప్పటికీ.. ఇది అద్భుతమైనదని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు. రోజూ ఉసిరికాయ తినడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి జలుబు, జ్వరం, ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదనంగా, ఇది గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక్క ఉసిరికాయ తినడం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. దీన్ని మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇంకా వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అయితే.. పరగడుపున దీనిని తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు..

6 Incredible Benefits of Amla Juice for ...

రోజూ ఒక్క ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:ఉసిరిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా మలబద్ధకం సమస్యను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఉసిరిలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కళ్ళకు చాలా ముఖ్యమైనది. ఉసిరికాయను రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.. కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

The Indian Gooseberry: Amla's health ...

 

జుట్టు మందంగా – మెరిసేలా చేస్తుంది: ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణనిచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి. అంతేకాకుండా, ఇది జుట్టును మందంగా, బలంగా, మెరిసేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది: ఆమ్లా కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇందులోని పీచు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. ఇంకా ఇది మీరు తక్కువ తినేలా చేస్తుంది.. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Here's why you must consume amla juice ...

ఉసిరికాయను ఎలా తినాలి?

ఉసిరికాయను అనేక రకాలుగా తినవచ్చు. మీకు కావాలంటే పచ్చిగా తినవచ్చు. లేదా జామ్, చట్నీ లేదా జ్యూస్ తయారు చేసుకోని తీసుకోవచ్చు.. అయినప్పటికీ, గరిష్ట ప్రయోజనాల కోసం పచ్చి ఉసిరి తినడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

 

Amla Health Benefits

ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు ఏమిటి? | what are the foods to overcome protein deficiency?

Related posts

Leave a Comment