Ambedkar statue vandalism case solved by police | అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు | Eeroju news

Ambedkar statue

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు

రామచంద్రాపురం

Ambedkar statue vandalism case solved by police

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ఈనెల 5వ తారీఖున అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును రామచంద్రపురం పోలీసులు త్వరితగతిన ఛేదించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేసారు. డీఎస్పీ  మాట్లాడుతూ సంఘటన స్థలం పరిసర ప్రాంతాలల్లో మద్యం సేవించిన 6 గురు వ్యక్తులు ఇక్కడ విగ్రహాన్ని పాడు చేస్తే వేరే చోట పెట్టుకుంటారని పథకం వేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడిన ఎవర్ని ఉపేక్షించేది లేదని  డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. త్వరితగతిన ఈ కేసును చేదించిన రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరరాజు, రామచంద్రపురం ఎస్సై సురేష్ బాబు,ద్రాక్షారామం ఎ.స్.ఐ. సురేంద్ర,పామర్రు ఎస్సై జానీ భాష,మండపేట ఏ.ఎస్సై చైతన్య లను జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ అభినందించారు..

Ambedkar statue

 

Will the YCP fight or will they take a U turn..? | పోరాడతారా…. యూ టర్న్ తీసుకుంటారా..?

 

Related posts

Leave a Comment