Amaravati:మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి సీఎం చంద్రబాబు:మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎలీప్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏపీ, ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం రాత్రి జరిగిన న్యూ జనరేషన్ టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
సీఎం చంద్రబాబు
అమరావతి,
ప్రభుత్వం నుంచి మహిళలకు మరింత ప్రోత్సాహకాలు
సంపాదనలో మగవారికంటే మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారన్న చంద్రబాబు
ఏఐలోనూ మహిళలు రాణించాలని ఆకాంక్ష
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, ఇందుకోసం ఎన్డీయే ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఎలీప్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏపీ, ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం రాత్రి జరిగిన న్యూ జనరేషన్ టెక్కేడ్ ఫర్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ అంతర్జాతీయ సదస్సులో ఆయన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
అనకాపల్లి జిల్లా కోడూరులో ఎలీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న హరిత పారిశ్రామిక పార్క్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఇదే వేదిక పక్కన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ. ప్రస్తుతం మహిళలు సంపాదనలో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారని అన్నారు. అన్ని రంగాల్లో అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళలు లేకుండా పురోగతి అసాధ్యమని వివరించారు. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని అన్నారు. 30 ఏళ్ల క్రితం వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా మద్దతు:
రాష్ట్రంలో వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఏ మహిళకైనా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నిర్మాణాత్మకమైన మద్దతును అందిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలను అన్ని రకాలుగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వివరించారు. ఈ విషయం తాను ఇప్పుడు మాట్లాడటం కాదు రాబోయే రోజుల్లో ఫలితాలను కూడా చూపిస్తానని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలను ప్రోత్సహించి అద్భుతాలను సృష్టిస్తామని అన్నారు.
ఏఐలోనూ మహిళలు రాణించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మహిళ కూడా ఏఐలో రాణించాలని, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని అన్నారు. మీరు ఆఫీసులో పని చేసి ఇంటికి వెళ్లేముందు ప్రోగ్రామ్ చేసుకుని ఇంటికి చేరుకునే సమయానికి ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవచ్చు. నూతన ఆవిష్కరణలే మన జీవితాలను మార్చుతాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రకారం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో విజన్‌ను రూపొందించాం. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపి 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
డిజిటల్ అక్షరాస్యత అవసరం:
నిరంతర అభ్యాసం ప్రతి ఒక్కరికీ అవసరం. అభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ, తద్వారా అపారమైన జ్ఞానాన్ని పొందగలం. ప్రపంచం వేగంగా మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను పొందాలంటే డిజిటల్ అక్షరాస్యత తప్పకుండా అవసరం. పౌరులు టెక్నాలజీతో పాటు సెల్‌ఫోన్‌లను కూడా విరివిగా వినియోగించాలి. ప్రస్తుత కాలంలో భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్య జీవించగలుగుతున్నారు కానీ సెల్‌ఫోన్ లేకుండా ఏ ఒక్కరూ ఉండలేకపోతున్నారు.
మహిళలు పని, గృహ బాధ్యతలను సమర్ధవంతంగా సమతుల్యం చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని తీసుకురాబోతున్నాం. మహిళలు నూతన ఆవిష్కరణలను తీసుకురావాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. అవకాశాలను అంచనా వేసుకుని, రాష్ట్ర పురోగతికి సమష్టిగా పనిచేయాలి. రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దాం. కార్యాచరణ, ఆవిష్కరణల ద్వారా ఏపీని ఎంట్రప్రెన్యూర్‌లకు కేంద్రంగా మార్చేందుకు కృషి చేసి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించేందుకు అందరం పనిచేద్దాం’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఎలీప్ ప్రెసిడెంట్ రమాదేవి మాట్లాడుతూ. మహిళా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు గాడ్ ఫాదర్ అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలోని మొదటి పారిశ్రామిక పార్క్ కు ఆయన గాజుల రామారంలో శంకుస్థాపన చేశారని, అది ప్రపంచానికే ఆదర్శంగా ఎదిగిందన్నారు. సరైన వసతులు కల్పిస్తే పురుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మహిళా పారిశ్రామికవేత్తలు దూసుకెళతారని నిరూపిస్తున్నారని అన్నారు.
Read more:Hyderabad:కొంప ముంచిన చెల్లని ఓట్లు