Amaravati:గ్రీన్ స్కిల్లింగ్‌పై స్వనీతి ఇనిషియేటివ్ తో ఒప్పందం

Green Skilling Development

రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు ఎంఓయు కుదిరింది. ప్రముఖ సామాజిక సంస్థ అయిన స్వనీతి ఇనిషియేటివ్ రాష్ట్రంలో పౌరసేవలను మెరుగుపర్చి, అట్టడుగువర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పన చేస్తుంది.

గ్రీన్ స్కిల్లింగ్‌పై స్వనీతి ఇనిషియేటివ్ తో ఒప్పందం

గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

మంత్రి లోకేష్ సమక్షంలో స్వనీతి, ఎపిఎస్ఎస్ డిసి ఎంఓయు

అమరావతి:
రాష్ట్రంలో గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధి కోసం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కీలక ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు ఎంఓయు కుదిరింది. ప్రముఖ సామాజిక సంస్థ అయిన స్వనీతి ఇనిషియేటివ్ రాష్ట్రంలో పౌరసేవలను మెరుగుపర్చి, అట్టడుగువర్గాల అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పన చేస్తుంది. పరిశోధన, డేటా, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో అనుభవం కలిగిన స్వనీతి ఇనియేటివ్ సంస్థ సమాజంలో వెనుకబాటుకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం కృషిచేస్తుంది. స్కిల్లింగ్‌కు సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌కు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది. కీలకమైన రంగాలు, పరిశ్రమలను గుర్తించి, స్థిరమైన జాబ్ మార్కెట్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమంలో స్వనీతి ఇనిషియేటివ్ ట్రస్టీ ఉమా భట్టాచార్య, స్టేట్ కన్సల్టెంట్ శివ ప్రసాద్, అసోసియేట్ తేజ సరియం, పాఠశాల విద్య, స్కిల్ డెవెలప్మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గణేష్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. గ్రీన్ స్కిల్లింగ్ కోసం ఆర్థికేతర సాంకేతిక సహకారం, సేవలను అందించేందుకు స్వనీతి ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) నడుమ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ వచ్చే 4నెలల్లో పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి వ్యూహం ముసాయిదాను రూపొందించి, వ్యూహం అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఇందుకోసం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ కోసం స్కిల్ ల్యాండ్ స్కేప్ అసెస్ మెంట్ చేస్తుంది. కీలకమైన వాటాదారులతో (పరిశ్రమ, పరిశ్రమ సంఘాలు, క్లస్టర్ సంఘాలు, శిక్షణా సంస్థలు – ITIలు, VTC, నైపుణ్య విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు మొదలైనవి.) సంప్రదింపులు జరిపి నివేదిక రూపొందిస్తుంది. జర్మనీ, US బృందాలు, సెక్టార్ నిపుణులు, విజయవంతమైన కేసులపై అవగాహనకు సమావేశాలు నిర్వహిస్తుంది. గ్రీన్ ఎనర్జీ రంగ నిపుణుల ఆలోచనలను పంచుకునేందుకు కీలకమైన భాగస్వాములతో వర్క్‌షాప్ లు నిర్వహిస్తుంది. కీలక వాటాదారులతో భాగస్వామ్యంతో వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. APSSDC సంస్థ తమ ప్రధాన కార్యాలయం నుండి పని చేసే స్వనిధి బృందానికి ప్రత్యేకంగా నైపుణ్య గణన, ఇన్ సైట్ ఇన్ఫర్మేషన్, గ్రీన్ స్కిల్లింగ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర సమాచారం అందిస్తుంది. టెక్నికల్ కన్సల్టెంట్లు APSSDC తాడేపల్లి కార్యాలయంలో పని చేయడానికి అవసరమైన స్థలాన్ని అందిస్తుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రభుత్వ శాఖల విశ్లేషణలు, వారితో సంప్రదింపుల కోసం సంబంధిత ప్రభుత్వ శాఖల యాక్సెస్ ఇచ్చి, సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.

Read:Hyderabad:మియాపూర్ లో మేయర్ అకస్మిక తనిఖీలు

 

Related posts

Leave a Comment