ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం..
‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’
అమరావతి :
ఏపీలో ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. ఈనెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. నెలకో అంశాన్ని ఎంచుకొని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు ఇందులో ప్రధానపాత్ర పోషించాలని సూచించారు.
Read:Khammam:కొత్తగూడెనికి ఎయిర్ పోర్టు