Amaravati:అమరావతి నిర్మాణం పై కూటమి ఫోకస్

Ap Alliance focus on construction of Amaravati

అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిధుల విడుదలకు ముందుకు వచ్చింది. బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది.

అమరావతి నిర్మాణం పై కూటమి ఫోకస్

విజయవాడ, జనవరి 23
అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిధుల విడుదలకు ముందుకు వచ్చింది. బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఈ నిధులు అందించేందుకు నిర్ణయించింది. తొలి విడతగా మూడు వేల కోట్లు విడుదలకు ప్రపంచ బ్యాంకు అంగీకరిస్తూ లేఖ రాసింది. మరి కొద్ది రోజుల్లో పనుల ప్రారంభానికి అన్ని రకాల కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హడ్కో ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( హడ్కో) ఈరోజు ముంబైలో సమావేశం అయింది. సంబంధిత బోర్డు సమావేశంలో అమరావతికి 11 వేల కోట్ల రూపాయల రుణం మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. సంప్రదింపులు తర్వాత హడ్కో రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.
అమరావతి రాజధాని నిర్మాణం ఎక్కడ నిలిచిపోయిందో.. అక్కడి నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకోవైపు భారీగా నిధులు సమకూరుతున్నాయి. ప్రపంచ బ్యాంకుతో పాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేశాయి. రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మిగతా ఆర్థిక సంస్థలు సైతం సాయం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.గత అనుభవాల దృష్ట్యా.. వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసింది. అమరావతి తో అనుసంధానిస్తూ కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను సైతం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏకకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రైవేటు సంస్థలు సైతం అమరావతిలోప్రైవేటు సంస్థల ఏర్పాటు సైతం చురుగ్గా చేపట్టాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. గతంలో చాలా సంస్థలు తమ కార్యకలాపాలను మొదలు పెట్టేందుకు సిద్ధపడ్డాయి. కానీ అప్పట్లో వైసీపీ సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అడుగులు పడుతున్నాయి. దీంతో సదరు సంస్థలు సైతం తమకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నాయి. మొత్తానికైతే అమరావతి రాజధానికి ఒక మహర్దశ వచ్చినట్టే.
అమరావతి మినహా.. రిజిస్ట్రేషన్లు పెంపు
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై చర్చ జరుగుతుంది. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టత ఇస్తూ..ఫిబ్రవరి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ బుక్ విలువ మధ్య ఎక్కువ తేడా ఉందని ప్రభుత్వం గుర్తించింది. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సమాచారం. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర అవసరాల కోసం అభివృద్ధి చేసేందుకు నిబంధనలు సులభతరం చేయనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుపై త్వరలో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారుల కసరత్తు పూర్తికాకపోతే ఛార్జీల పెంపు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. ఇందులో మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 0 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుంది. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గే అవకాశం కూడా ఉంది.

Read:Tirupati:తొక్కిసలాటపై విచారణ కమిటీ

Related posts

Leave a Comment