Amalapuram:తగ్గిన నేరాల నమోదు

amalapuram

కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు వార్షిక నివేదిక ను విడుదల చేసారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో జరిపించునందుకు అందరికీ ధన్యవాదములు.

తగ్గిన నేరాల నమోదు

అమలాపురం
కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు వార్షిక నివేదిక ను విడుదల చేసారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో జరిపించునందుకు అందరికీ ధన్యవాదములు. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ ABCD అవార్డు మన జిల్లాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. జిల్లాలో  డ్రోన్ కెమెరాలు ఎక్కువగా ఉపయోగించడం అవసరం.  క్రైమ్ రేటు గణాంకలనుబట్టి క్రిందటి  సంవత్సరం కంటే తక్కువ నమోదు అయ్యాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ లో కూడా కేసులు తగ్గువగా ఉన్నాయి . తగిన చర్యలు తీసుకోవటం వల్ల క్రైమ్ రేట్ ,అస్థితగాదాలు,పలు కేసుల్లో తగ్గుదల నమోదు అవుతున్నాయి. అత్యాచారాల కేసుల్లో,పొక్సో కేసులు క్రమీన తక్కువ అవుతున్నాయి . సైబర్ క్రైమ్ ,ఆన్లైన్ కేసుల్లో కూడా రేషియో తక్కువ అవ్వటం జరుగుతుంది. మొబైల్ ఫోన్ కేసుల విషయంలో కూడా  తక్కువ నమోదు అవుతున్నాయి. జిల్లాలో గంజాయి విషయం లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ఆన్లైన్ గేమింగ్ లో కూడా  కేసులు తక్కువ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ కేసుల్లో ,ఇప్పుడు   పోలీస్ కష్టపడి వాటిని చేదిస్తున్నారని అన్నారు.
ఈ సంవత్సరం కూడా  ఇంకా మెరుగైన పనితనం తో జిల్లా లో శాంతి భద్రతలు కాపడతమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు . డిసెంబర్ 31 నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా చూస్తామని జిల్లా ఎస్పీ తెలియచేసారు. జిల్లాలో పోలీస్ సేవలను గుర్తించి పోలీసులకు రివార్డులు అందచేసారు .

Read:Amit Shah:అమిత్ షా రాజీనామా

Related posts

Leave a Comment