సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ముందస్తు బెయిల్‌పై రిలీజ్ కావడం పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలుగు ప్రజలున్న ప్రతిచోటా, ఇక టాలీవుడ్లో అయితే ఏ రేంజిలో చర్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 24 గంటల్లోనే బన్నీ బయటికొచ్చేశారు.
-అల్లు అర్జున్ ను సొంతం చేసుకొనే పనిలో వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్
ఏలూరు, డిసెంబర్16, (న్యూస్ పల్స్)
సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ముందస్తు బెయిల్‌పై రిలీజ్ కావడం పెద్ద బర్నింగ్ టాపిక్ అయ్యింది. అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలుగు ప్రజలున్న ప్రతిచోటా, ఇక టాలీవుడ్లో అయితే ఏ రేంజిలో చర్చ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 24 గంటల్లోనే బన్నీ బయటికొచ్చేశారు. దీంతో దొరికిందే ఛాన్స్ అంటూ ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా, క్రెడిట్ కోసం మెగాభిమానులు, వైసీపీ క్యాడర్ మధ్య క్రెడిట్ ఫైట్ మొదలైంది.మెగా ఫ్యామిలీనే చేసిందని మెగాభిమానులు చెప్పుకుంటూ ఉంటే, కానే కాదని చేసిందంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. మధ్యలో అటు మెగాభిమానులకు, ఇటు వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఇక చాలు ఆపండ్రా బాబోయ్ బెయిల్ హైకోర్టు ఇచ్చిందన్న విషయం మరిచిపోయి కొట్టుకుంటున్నారేంటి? అంటూ కౌంటర్ ఇచ్చి పడేస్తున్నారు. దీనంతటికీ కారణం అల్లు అర్జున్ నియమించుకున్న న్యాయవాది సిర్గాపూర్ నిరంజన్ రెడ్డే.1970 జూలై 23న నిర్మల్ జిల్లా సిర్గాపూర్‌లో విద్యాసాగర్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు నిరంజన్ రెడ్డి జన్మించారు. హైదరాబాద్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1994 నుంచి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పనిచేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితులయ్యారు.అలా నిరంజన్ రెడ్డి వృత్తి చేస్తూ, సినిమాలు తీయడం, వ్యాపారాలు చేయడం ఆది నుంచీ చేస్తున్నదే. 2010 నుంచే సినిమాలు తీస్తున్న ఆయన, 2022లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. చిన్న చిన్న సినిమాలతో పాటు పెద్ద హీరోలతోనూ తీశారు. అక్కినేని నాగార్జునతో గగనం, వైల్డ్ లాగ్, మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాలను నిర్మించారు. వీటన్నింటికీ మించి చిరు అంటే విపరీతమైన అభిమానం, మెగా ఫ్యామిలీకి సంబంధించిన లీగల్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడే. వైఎస్ మరణాంతరం వైఎస్ జగన్‌కు మరింత దగ్గరకావడం అక్రమాస్తుల కేసులు మొదలుకుని ఇప్పటి వరకూ ఏమున్నా చూసుకుంటూ వస్తున్నారు. దీనికి తోడు అటు వైఎస్ ఫ్యామిలీకి, ఇటు వైసీపీకి సంబంధించి లీగల్‌గా ఏమున్నా సరే నిరంజన్ రెడ్డే చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నిరంజన్‌రెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న వైఎస్ జగన్ పెద్దల సభకు పంపారు.బన్నీ అరెస్ట్ అయిన నిమిషాల వ్యవధిలోనే అల్లు అరవింద్ నుంచి మెగాస్టార్‌కు ఫోన్ కాల్ వెళ్లిందని, ఆయన నేరుగా నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపారన్నది నడుస్తున్న చర్చ. తన హీరో, పెద్ద తలకాయ చెప్పడంతో వేరే పనులేమీ పెట్టుకోకుండా బెయిల్ వ్యవహారమే నిరంజన్ చూసుకున్నారని తెలిసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం బెయిల్ వచ్చేంత వరకూ మేనల్లుడి వ్యవహారాన్ని భుజానికెత్తుకొని చిరంజీవి చూసుకున్నారంటూ మెగాభిమానులు చెప్పుకుంటున్నారు. షూటింగ్లో బిజిబిజీగా ఉన్న చిరు మధ్యలోనే వదిలేసి హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. మూడు గంటలపాటు నిరంజన్ రెడ్డితో టచ్‌లోకి మినిట్ మినిట్ ఏం జరుగుతోందని చిరు తెలుసుకున్నారట.ఏం చేసైనా సరే అల్లు అర్జున్ను గంట కూడా జైలులో పెట్టకూడదని చిరు, అరవింద్ ఇద్దరూ న్యాయ నిపుణులు, లాయర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సెట్ చేసుకుంటూ వచ్చారని ఈ క్రెడిట్ అంతా మెగా ఫ్యామిలీకే అని వస్తుందని మెగాభిమానులు చెప్పుకుంటన్న పరిస్థితి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇందులో కలుగజేసుకోవడంతో అంతా సవ్యంగా సాగిందని, నేరుగా ఆయన రాకపోయినా అన్నీ ఫోన్లోనే చూసుకున్నారని జనసైనికులు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలు మొదలుకుని పుష్ప రిలీజ్ వరకూ వైసీపీ క్యాడర్, నేతలు అల్లు అర్జున్ ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. ఎంతలా అంటే రానున్న ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పేసుకుంటాడనేంతలా. ఆఖరికి బన్నీ అరెస్టుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడం ఇదొక చర్చకు దారితీసింది. అనవసర విషయాల్లో కలుగజేసుకోవడం, క్రెడిట్ కొట్టేయడానికి వైసీపీ ముందుంటుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తన పార్టీ ఎంపీ, తన లీగల్ వ్యవహారాలు చూసుకునే వ్యక్తి నిరంజన్ రెడ్డికి జగన్ చెప్పడం వల్లే, ఆయన రంగంలోకి దిగారన్నది వైసీపీ చెప్పుకుంటున్న మాట. నేరుగా వైఎస్ జగన్ రంగంలోకి దిగడంతోనే బెయిల్ వచ్చిందని ఈ క్రెడిట్ అంతా జగన్‌దేనని, వైసీపీకే దక్కాలని క్యాడర్ చెప్పుకుంటున్న పరిస్థితి.థ్యాంక్యూ నిరంజన్ రెడ్డి అంటూ వైసీపీ ఆయన్ను దేవుడిలాగా చూస్తున్న పరిస్థితి. అటు మెగాభిమానులు, ఇటు వైసీపీ వీరాభిమానులు ఈ విషయంపైనే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఫైట్ చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ అల్లు అర్జున్ అంటే అస్సలు పడని, కనీసం పుష్ప2ను కనీసం పట్టించుకోని మెగా ఫ్యామిలీ ఇంటికొచ్చి క్రెడిట్ కొట్టేస్తామంటే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదని వైసీపీ క్యాడర్ వాదిస్తోంది. ఇదంతా కాదు మా ఫ్యామిలీ మెంబర్ బన్నీ కావడంతో, ఇంటి, ఇండస్ట్రీ పెద్దన్నగా ఉన్న చిరంజీవి రాకతోనే ఇదంతా సాధ్యమైందని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు విమర్శలు, ఆరోపణలు అంతకుమించి కౌంటర్లు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చే చేస్తున్నారు.థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌తో ప్రమేయం, ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో బన్నీకి హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ఫ్యాన్స్, బన్నీ ఆర్మీ అటు ఇటూ ఇద్దరికీ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. అల్లు అర్జున్ ఎంతైనా డబ్బున్నోడు గనుక జస్ట్ కొన్ని గంటల్లోనే అరెస్ట్, జైలు, బెయిల్, విడుదల అయ్యాడని సామాన్యుడి నోట వినిపిస్తున్న మాట. బన్నీ అరెస్ట్ మొదలు బయటికొచ్చేంతవరకూ జరిగినదంతా చట్టం, న్యాయం నత్తనడకన నడుస్తున్నాయనే చర్చ సైతం నడుస్తోంది.
Read : YSRCP : జమిలీపై వైసీపీ ఆశలు