Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం ధైర్యం ఏమిటి?

allu arjun arrest

హైదరాబాద్, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్టు పై జరుగుతున్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారాన్ని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శించారు.అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి.. తన ప్రమేయం ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని.. అరెస్ట్ కంటే ముందు అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారని రేవంత్ వివరించారు. ఆ తర్వాత రేవంత్ అంతటితోనే ఆగలేదు. ఢిల్లీలో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఆయన ఏమైనా సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? నాలుగు సినిమాలు చేశాడు.. అందులో పెట్టుబడి పెట్టాడు.. అంతకంటే ఎక్కువ పైసలు సంపాదించాడు. ఇవాళ ఏదో ఆయన అరెస్టు ను రకరకాలుగా చిత్రీకరించడం సరికాదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మీడియాలో సంచలనం నమోదయింది. మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని పక్కనపెట్టి.. అతడికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం మానేసి.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టింది. మొదట్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత అతడేమైనా సరిహద్దులో యుద్ధం చేసిన సైనికుడా? అని వ్యాఖ్యానించడంతో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలోనూ రేవంత్ దూకుడుగానే మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టుపై మొహమాటం లేకుండా స్పందించారు. ఏమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో నిల్చొని యుద్ధం చేశాడా?, అతను కేవలం ఒక సినిమా హీరో. ఈ దేశం లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్త్ లాంటి సూపర్ స్టార్స్ అరెస్ట్ అవ్వలేదా?, పుష్ప 2 చిత్రానికి నిర్మాతలు కోరిన వెంటనే మేము బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇచ్చాము. సరైన ప్రోటోకాల్స్ లేకుండా ఆయన థియేటర్ కి వచ్చాడు. కారెక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ కూడా చేసాడు. అలా చేయడం వల్లనే అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. అతని కారణంగా ఒక మహిళ చనిపోయింది. ఒక పసి బిడ్డ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిని మేము తేలికగా వదిలేయాలా?, దీనిపై మేము కేసు పెట్టి చర్యలు తీసుకోకపోయితే , జనాలు పెట్టలేదని మమ్మల్ని అడగరా?, తప్పు ఎవరు చేసినా తప్పే చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.‘అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్లిపోకుండా, కారు ఎక్కి చాలా హంగామా సృష్టించాడు. జనాలు ఎక్కువ ఉన్న చోట ఒక సెలబ్రిటీ వస్తే ఎలా ఉంటుందో అతనికి ఆ మాత్రం తెలియదా?, పోలీసులు వద్దని చెప్తున్నా కూడా లెక్క చేయకుండా ప్రోటోకాల్స్ ని ధిక్కరిస్తే ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. అతనికి స్పెషల్ షో చూడాలని అనిపిస్తే ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది , లక్షణంగా చూసుకోవచ్చు కదా, ఇలా లేనిపోని హంగామా సృష్టించడం ఎందుకు’ అంటూ ఆయన సూటి ప్రశ్నలు వేసాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ తీరుని తప్పు పెట్టేవాళ్ళు కొందరుంటే, మరి కొందరు మాత్రం ఆయనని సమర్థిస్తున్నారు. ” ఒక సినీ నటుడు తన సినిమాను ఇంట్లో చూసుకోవచ్చు. లేకుంటే హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు. అంతేగాని అంతమంది జనం వచ్చినచోటకు కార్లో చేయి ఊపుతూ రావడం వల్ల జనం భారీగా వచ్చారు. ఆ సమయంలో వారందరినీ కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. అందువల్లే తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఓ భర్త తన భార్యను కోల్పోవాల్సి వచ్చింది. తన కుమారుడిని కాపాడుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతకంటే దారుణం ఏముంటుందని” రేవంత్ వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి కి సహజంగానే దూకుడు ఉంటుంది. ఆ దూకుడు వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నాటి అధికార భారత రాష్ట్ర సమితిని ఎక్కడికక్కడ ఎండగట్టారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో ఆయనను కావాలని ఓడించినప్పటికీ.. మల్కాజ్ గిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో జవ సత్వాలు నింపారు. ఏకంగా అధికారంలోకి తీసుకొచ్చారు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఏడాది పాటు తన పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి తన దూకుడు తగ్గించుకోవడం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని విషయాలలోనూ సానుకూల ధోరణి కంటే మరింత దూకుడు తనాన్ని ప్రదర్శిస్తున్నారు . దీనిని కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ.. రేవంత్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా సై అన్నట్టుగా పోటీకి సంకేతాలు ఇస్తున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలోనూ రేవంత్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా దూకుడు తత్వాన్ని కొనసాగించారు. రేవంత్ వ్యవహార శైలిని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా తప్పు పడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం గట్టిగానే సమాధానం ఇస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య ఏకంగా యుద్ధమే జరుగుతున్నది.

లాయర్ ఫీజు గంటకు 5 లక్షలు

ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు వాదనలు వినిపించిన లాయర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ లాయర్ నిరంజన్ రెడ్డి ఎవరు. ఆయన ఇంతకుముందు ఎలాంటి కేసులు వాదించారు. ఆయన గంటకు ఎంత ఫీజు వసూలు చేస్తారు. లాయర్ వృత్తి మాత్రమే కాకుండా ఆయన ఇంకా ఏమేం చేస్తారు అనేది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ వెంటనే మధ్యంతర బెయిల్ మంజూరు కావడం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదంటూ సినీ, ఇతర రంగాల ప్రముఖులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ “రయీస్” సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి.. అల్లు అర్జున్‌కు కోర్టు బెయిల్ ఇవ్వడంలో కీలక వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి లాయర్ మాత్రమే కాదు. ఆయన ప్రస్తుతం వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2022లో సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇదే కాకుండా ఆయన సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చేశారు. ఇప్పటివరకు ఆయన పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఉండటం గమనార్హం. మిగితావి క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్ సినిమాలు ఉన్నాయి. 2011లో వచ్చిన గగనం సినిమాతో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని నిర్మల్. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి కూడా ప్రముఖ లాయర్. నిరంజన్ రెడ్డి నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌లోనూ విద్యాభ్యాసం చేశారు. 1992లో లా డిగ్రీ పూర్తి చేసిన నిరంజన్ రెడ్డి.. మహారాష్ట్ర పుణెలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్‌లోనూ చదువుకున్నారు. ఓవైపు లాయర్‌గా పలు కేసులు వాదిస్తూనే.. అటు ప్రొడ్యూసర్‌గా, ఇటు రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్‌గా వసూలు చేసే ఫీజు గురించి కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించడంతో నిరంజన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సీనియర్ లాయర్ అయిన సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి.. గంటకు రూ.5 లక్షలు వసూలు చేస్తారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.అంతేకాకుండా పలు ముఖ్యమైన హై ప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం సిర్గాపూర్ నిరంజన్ రెడ్డికి ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్‌ ఫ్రెండ్ శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి.. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డిని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. తనకు ఉన్న పొలిటికల్ పరిచయాలతో తన పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డికి కేసు అప్పగించినట్లు సమాచారం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అప్పట్లో ప్రచారం నిర్వహించారు.

Read : Pawan Kalyan : కేంద్ర మంత్రిగా పవన్…

Related posts

Leave a Comment