Allu Arjun:అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతోంది

What is happening with Allu Arjun? Discussion on Congress party stand

అల్లుఅర్జున్ ఎపిసోడ్‌ రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని మీడియా సైతం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, ఆపై మీడియాలో చర్చ దారితీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్ విషయంలో ఏం జరుగుతోంది
కాంగ్రెస్ పార్టీ స్టాండ్ పై చర్చ. 

హైదరాబాద్.
అల్లుఅర్జున్ ఎపిసోడ్‌ రోజురోజుకూ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని మీడియా సైతం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. జరుగుతున్న వ్యవహారాలను సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. పోలీసులు, నేతలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడం, ఆపై మీడియాలో చర్చ దారితీయడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి.దీనిపై ఇండస్ట్రీ సైలెంట్ కావడంతో.. నేతలు సైతం నోరు ఎత్తకుండా ఉంటేనే బెటరని అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పీసీసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు కీలక సూచనలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండాలన్నది అందులోని సారాంశం. పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని పీసీసీని ఆదేశించినట్టు తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాల చివరి‌రోజు సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఇకపై ప్రత్యేక షోలు, టికెట్ల పెంపు ఉండదని ఓపెన్‌గా చెప్పేశారు. అదే రోజు సాయంత్రం నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.ఇటు పోలీసులు.. మంత్రులు, నేతలు కౌంటర్ ఎటాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. పార్టీలోని నేతలంతా అల్లుఅర్జున్‌ను దుమ్మెత్తిపోశారు. ఈ వ్యవహారంపై జాతీయ మీడియాలో చర్చకు దారితీసింది.

జరుగుతున్న పరిణామాలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై పీసీసీకి ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల మాట.మరోవైపు ఏఏ ఎపిసోడ్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు సైలెంట్ అయ్యారు. న్యాయస్థానంలో కేసు ఉండడంతో రకరకాలుగా మాట్లాడడం సరికాదని భావిస్తున్నారు. దీనికితోడు సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో విబేధాలకు దిగడం కరెక్టుకాదని అంటున్నారు.సినీ వ్యాపారాల్లో ఏ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న సందర్భాలు లేవని చెబుతున్నారు. మనకు కావాల్సిన సదుపాయాలు ఇస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రేపో మాపో టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.సమావేశాలు, చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని, దయచేసి దీన్ని పెద్దది చేయడం కరెక్టు కాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక బన్నీ వ్యవహారంపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మరోవైపు బినిఫిట్ షోల రద్దు మంచిదేనని ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు. కొంతమంది ప్రొడ్యూసర్ల వల్లే ప్రేక్షకులకు ఇబ్బందని అంటున్నారు.

Read:AP High Court.ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని.

Related posts

Leave a Comment