All from Bangalore.. Shift from Tadepalli.. | అంతా బెంగళూరు నుంచే … తాడేపల్లి నుంచి షిఫ్ట్…. | Eeroju news

అంతా బెంగళూరు నుంచే ... తాడేపల్లి నుంచి షిఫ్ట్....

అంతా బెంగళూరు నుంచే …

తాడేపల్లి నుంచి షిఫ్ట్….

కడప, ఆగస్టు 19 (న్యూస్ పల్స్)

All from Bangalore.. Shift from Tadepalli..

జగన్ ఎందుకో ఏపీలో ఉండేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. పని ఉంటే మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కు వస్తున్నారు. పని ముగిసిన వెంటనే బెంగళూరు వెళుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంత సేఫ్ కాదని భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. తనపై నిఘా ఉంటుందని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఇక్కడ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరపకూడదని భావిస్తున్నారు. నేరుగా బెంగళూరు నుంచి చేసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని.. అదే హైదరాబాద్ అయితే చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వం అక్కడ ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచే బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు.

నెలలో మూడు వారాలపాటు అక్కడే ఉంటున్నారు. మధ్యలో రకరకాల కారణాలు చూపి తాడేపల్లి ప్యాలెస్ కి వస్తున్నారు. చిన్న చిన్న పనులు చూసి మళ్ళీ బెంగళూరు వెళుతున్నారు. గత రెండు నెలల్లో పదిసార్లు బెంగళూరు వెళ్లారు. తాడేపల్లి ప్యాలెస్ కంటే అక్కడే ఎక్కువ రోజులు గడిపారు. జగన్ రాజకీయాల స్టైల్ వేరు. మొన్న ఆ మధ్యన తన అస్మదీయులైన ఐఏఎస్,ఐపీఎస్ అధికారులను పిలిపించుకొని బెంగళూరులో మాట్లాడారట. దాని ఫలితమే సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేసిన అధికారులకు ఏపీ సిఎస్ సరికొత్త ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. వీరంతా రహస్యంగా బెంగళూరులో జగన్ ను కలవడమే ఇందుకు కారణంగా అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

గత ఐదేళ్లలో జగన్ పుణ్యమా అని అధికార వర్గాల్లో కూడా ఒక గీత ఏర్పడింది. తనకోసం మాత్రమే పనిచేసే అధికారులకు పెద్దపీట వేశారు జగన్. అందుకే ఎక్కడో 15వ సీనియారిటీ ర్యాంకులో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి ని తెచ్చి ఈ రాష్ట్రానికి డిజిపి చేశారు.అస్మదీయ అధికారులకు పెద్ద పీటవేయడం, ఇష్టం లేని వారికి పోస్టింగ్ ఇవ్వకుండా తొక్కేయడం గత ఐదేళ్లుగా చూసాం. అటువంటి జగన్ అస్మదీయ అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారుప్రస్తుతానికి బెంగళూరు అయితే సేఫ్ జోన్ అని జగన్ భావిస్తున్నారు. ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం ద్వారా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.తద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

బెంగళూరు నుంచి కార్యకలాపాలు, రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అక్కడి నిఘా వర్గాల సాయాన్ని తీసుకుంటున్నారు. తద్వారా తన రాజకీయ అడుగులు టిడిపి కూటమి పార్టీలకు తెలియకూడదు అన్నది జగన్ ప్లాన్. అందుకే వ్యూహాత్మకంగా బెంగళూరు నుంచి పావులు కదపడం ప్రారంభించారుజగన్కు కేడర్ తో పనిలేదు. కేవలం ఎన్నికల వ్యూహంతోనే తతంగం జరపవచ్చని భావిస్తున్నారు. పైగా 40 శాతం ఓటింగ్ను సొంతం చేసుకున్నామన్న ధీమా ఆయనలో కనిపిస్తోంది. ఆ క్యాడర్ చిక్కుచెదరదన్న అతిధి మాతో ఆయన ఉన్నారు. అందుకే సొంత రాష్ట్రం లో ఉండి రాజకీయం చేయకపోయినా పర్వాలేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే బెంగళూరును అడ్డగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.

అంతా బెంగళూరు నుంచే ... తాడేపల్లి నుంచి షిఫ్ట్....

 

Jagan Tailam to the local representatives of the Visakha Agency | విశాఖ ఏజెన్సీ స్థానిక ప్రజాప్రతినిధులకు జగన్ తాయిలం… | Eeroju news

Related posts

Leave a Comment