ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యయ ఖాళీలు నింపాలి | According to the given word, Upadhyaya should fill the blanks | Eeroju news

సిద్దిపేట

పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్స్  మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేలకు పైన పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది. ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుంది.  రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది.

అభివృద్ధిలో విద్యలో ఏ రంగంలో అయినా సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో  అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నది. సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాల మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుకున్నాము.  ఈ పాఠశాలలో హాస్టల్ కి వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయించుకొని ప్రారంభించుకుంటామని హామీ ఇస్తున్నాను. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలకు ఏ అవసరం ఉన్న ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వం నుండి, దాతల సహకారంతో వసతులను ఏర్పాటు చేస్తాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను.

కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వం స్కూళ్లలో ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్య సిబ్బందిని ఉచిత కరెంటు ఇవ్వాలని ముఖ్యమంత్రి  కోరుతున్నాను.డీఎస్సీలో 25 వేల ఖాళీలు నింపుతామని  చెప్పి 11వేల ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు.  ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు  నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.స్కూలు ప్రారంభమైన సందర్భంగా వర్షాకాలంలో వచ్చే సమస్యలను  దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మరమ్మతు చర్యలు  వెంటనే చేపట్టాలని కోరుతున్నాను. తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతున్నది. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు  పంపించే బాధ్యత తీసుకోవాలి. క్రమం తప్పకుండా పాఠశాలకు పంపే విధంగా కృషి చేయాలి.

తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం  ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్య అందించింది. కాబట్టి విద్యార్థులు తెలుగు మీడియంలోనే కాకుండా, ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. సిద్దిపేట బాలుర ప్రభుత్వ పాఠశాలలో 98 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు మీ అందరికీ అభినందనలు.. అదేవిధంగా ఈ సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత సాదించడానికి మీరందరూ కృషి చేయాలని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నా వంతు కృషి నిత్యం ఉంటుంది. గత సంవత్సర సిద్దిపేట జిల్లా  పదో తరగతి ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మొదటి స్థానంలో నిలవాలి. అందుకు అందరం కృషి చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు  నా సొంత ఖర్చు 5 లక్షలతో గత ఏడాది స్నాక్స్ అందించడం జరిగింది. నిరంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి కోసం కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

Related posts

Leave a Comment