పాలకొల్లు
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసిన నిమ్మల రామానాయుడు కు టిడిపి మరియు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లు మండలం సగం చెరువు నుండి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీగా ప్రజలు తరలివచ్చారు. గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుండి విముక్తి జరిగి ఈరోజు ప్రజా పాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలికారని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా ఉద్యమం జరిగి ఏదైతే తెల్ల దొరలను భారతదేశం నుంచి పారద్రోలిన విధంగా జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారన్నారు కొత్త ప్రభుత్వానికి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చి స్వాగతం పలుకుతున్నారన్నారు…