A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

A review of bonala arrangements in Balkampeta temple

బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్

A review of bonala arrangements in Balkampeta temple

బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ  దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,కమిషనర్ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ కోటా నిలిమా, స్థానిక కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్ ,పోలీస్, విద్యుత్ , వాటర్ వర్క్స్,ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు, గతంలో జరిగిన ఇబ్బందులు పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. నగరంలో బోనాల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కళ్యాణం ఉత్సవాలకు రాబోయే నెల రోజుల పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి అధికారులతో సమీక్షా సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం బోనాల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత సంవత్సరం బోనాలకు 15 కోట్లు నిధులు ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి  చొరవతో ఈసారి 20 కోట్లు కేటాయించారు. బల్కం పేట ఎల్లమ్మ ఆలయంలో పోలీసులు, విద్యుత్,వాటర్ వర్క్స్  ఇతర డిపార్ట్మెంట్ ల వారీగా సమీక్ష జరుపుకుంటున్నామని అన్నారు.

A review of bonala arrangements in Balkampeta temple

 

జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం | Minister Ponnam Prabhakar is angry with GHMC officials | Eeroju news

 

 

Related posts

Leave a Comment